AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras Gold: ధంతేరస్ రోజున బంగారం, వెండి కొంటున్నారా..? ఈ టైమ్ మిస్ కావొద్దు.. శుభ ముహూర్తం ఇదే..

దీపావళికి ముందు నవంబర్ 6వ తేదీన ధంతేరస్ వస్తుంది. ఆ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. దీంతో ఆ రోజు శుభ ముహూర్తం చూసుకుని బంగారం, వెండి లాంటి వస్తువులు కొంటారు. తెలుగు రాష్ట్రాల్లో శుభ ముహూర్తాలు ఇవే..

Dhanteras Gold: ధంతేరస్ రోజున బంగారం, వెండి కొంటున్నారా..? ఈ టైమ్ మిస్ కావొద్దు.. శుభ ముహూర్తం ఇదే..
Gold Dhanteras
Venkatrao Lella
|

Updated on: Nov 02, 2026 | 12:04 PM

Share

ప్రతి సంవత్సరం దీపావళికి ముందు వచ్చే ధంతేరస్ రోజున బంగారం కొంటే మంచిదని చాలామంది నమ్ముతారు. ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన దీపావళి వస్తుండగా.. నవంబర్ 6న శుక్రవారం ధంతేరస్ వస్తుంది. లక్ష్మీదేవి, కుబేరుడికి ఈ పండుగను అంకితం చేశారు. దీంతో నవంబర్ 6న బంగారం కొంటే శుభం జరుగుతుందని, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని బాగా నమ్ముతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ధంతేరస్ రోజున బంగారం కొనుగోలు చేయడానికి మంచి ముహూర్తం ఏంటనేది ముందే తెలుసుకుంటారు. ఆ సమయానికి వెళ్లి బంగారం, సిల్వర్ లాంటివి కొనుగోలు చేసే సాంప్రదాయం దేశంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ధంతేరస్ రోజున బంగారం కొనుగోలు చేయడానికి మంచి సమయం ఏంటనేది తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో మంచి సమయం ఇదే..

ధంతేరస్ రోజున బంగారం, వెండి కొంటే శ్రేయస్సు, సమృద్ది, అదృష్టం కలుగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. ఈ రోజున బంగారు ఆభరణాలు, నాణెలు లేదా వెండి పాత్రలు, ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేసే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. కొనుగోలు చేసిన వస్తువులను పూజ గదిలో పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మంచి సమయం, ముహూర్తం ఏంటనేది ముందే పండితుల ద్వారా తెలుసుకుని తమ కొనుగోళ్లను ప్లాన్ చేసుకుంటారు. అయితే మంచి సమయాలు అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. హైదరాబాద్ విషయానికొస్తే.. నవంబర్ 6న ఉదయం 10.30 గంటల తర్వాత ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసేందుకు మంచి సమయమని పండితులు చెబుతున్నాయి. అయితే సాయంత్రం 6.15 గంటల నుంచి 8.13 గంటల వరకు మధ్య కొనుగోలు చేస్తే మరింత మంచిదని అంటున్నారు. సాయంత్రం షాపుల్లో ఎక్కువ జనం రద్దీ ఉంటుంది గనుక ఉదయం 10.30 గంటల తర్వాత ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.

ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసే సాంప్రదాయం

ఇక ధంతేరస్‌ రోజున బంగారం, వెండితో పాటు ఇత్తడి, రాగి, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొత్తగా కొన్న పాత్రలను ఇంటిలోకి తీసుకువచ్చే ముందు వాటిలో బియ్యం, గోధుమలు లేదా నీటిని నింపుతారు. ఇక కొంతమంది కార్లు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇతర గృహావసర వస్తువులను ఈ పండుగ రోజున కొనుగోలు చేస్తే మంచిదని నమ్ముతారు. కాగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో ఈ సారి పండక్కి వీటి సేల్స్ పెరిగే అవకాశముంది. దీంతో వ్యాపారులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మేకింగ్ ఛార్జీలు తగ్గిస్తామంటూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు
రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్
రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్
IPL Retention: రూ.14.2 కోట్ల ప్లేయర్‌కు సీఎస్కే గుడ్‌బై..!
IPL Retention: రూ.14.2 కోట్ల ప్లేయర్‌కు సీఎస్కే గుడ్‌బై..!
నాకు క్యాన్సర్ అని తెలియగానే ఆ హీరో 2 లక్షలు పంపించారు..
నాకు క్యాన్సర్ అని తెలియగానే ఆ హీరో 2 లక్షలు పంపించారు..
శరీరానికి, నరాలకు కొండంత బలం.. నెలకు ఒక్కసారైనా తినండి..
శరీరానికి, నరాలకు కొండంత బలం.. నెలకు ఒక్కసారైనా తినండి..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..