AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న ఇనుప యుగం సీక్రెట్?

పురావస్తు రంగాన్ని ఆశ్చర్యపరిచేలా స్పెయిన్‌లో ఒక అరుదైన ఆవిష్కరణ జరిగింది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ప్రజలు ధరించిన 8 గడ్డి చెప్పుల అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇనుప యుగం ముగిసి, రోమన్ సామ్రాజ్యం విస్తరిస్తున్న కాలంలో నాటి సాధారణ కార్మికులు ఎలాంటి దుస్తులు, పాదరక్షలు వాడేవారో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఒక కీలక ఆధారంగా మారింది.

పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న ఇనుప యుగం సీక్రెట్?
2,000 Year Old Sandals
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2026 | 7:15 PM

Share

స్పెయిన్‌లోని ఒక పురాతన మైనింగ్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో దాదాపు 2,000 సంవత్సరాల నాటి గడ్డితో చేసిన చెప్పులను కనుగొన్నారు. స్పెయిన్‌లోని సెవిల్లెకు పశ్చిమాన ఉన్న యురియం అనే ప్రాచీన మైనింగ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఇవి లభ్యమయ్యాయి. సాధారణంగా మొక్కలు, గడ్డితో తయారు చేసే వస్తువులు వందల ఏళ్లపాటు భూమిలో ఉంటే కుళ్ళిపోయి నాశనమవుతాయి. కానీ, ఇక్కడి ప్రాచీన లోహపు కొలిమిల పక్కనున్న బూడిద నిల్వలలో పడేయడం వల్ల, ఆ బూడిదలోని రసాయనాలు, పొడి వాతావరణం ఈ చెప్పులు పాడైపోకుండా కాపాడాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వాటిని ఎలా తయారు చేశారంటే?:

ఈ పాదరక్షల అడుగు భాగాన్ని గట్టిగా ఉండే ఎస్పార్టో అనే ప్రత్యేకమైన గడ్డితో తయారు చేశారు. గడ్డిని నానబెట్టకుండా నేరుగా చుట్టి, సమతలంగా అల్లి అడుగు భాగం సిద్ధం చేశారు. ఎక్కువ బరువు పడే చోట మందపాటి గడ్డి తాడులను, కాళ్లకు పట్టుత్వం కోసం సన్నని దారపు పొరలను ఉపయోగించినట్లు గుర్తించారు.

అలంకారం కాదు.. శ్రామికుల పాదరక్షలు!:

ఈ గడ్డి చెప్పులను రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించగా, ఇవి క్రీస్తు పూర్వం 360 నుంచి క్రీస్తు శకం 124 మధ్య కాలానికి చెందినవని తేలింది. లభించిన అన్ని చెప్పులలో గోళ్లు, కాళ్ల రాపిడి వల్ల అరిగిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. చాలా వాటికి కట్టుకునే పట్టీలు తెగిపోయి ఉన్నాయి. ఇవి విలాసవంతమైన కార్యక్రమాల్లో వాడేవి కావు అని, మైనింగ్ ప్రదేశంలో కష్టపడి పనిచేసే శ్రామికులు నిత్యం వాడి పడేసినవని స్పష్టమవుతోంది. ఈ రకమైన పరిశోధనలు వేల ఏళ్ల క్రితం జీవించిన సాధారణ మానవుల దైనందిన జీవితాన్ని కళ్లకట్టినట్లు చూపిస్తాయని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!