ఆరేళ్ళలో తెలంగాణకు లక్షన్నర కోట్లు: నిర్మలమ్మ వాదనలో నిజమెంత?
గత ఆరేళ్లలో తెలంగాణకు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలిచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిధుల వివరాలను లోక్‌సభలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో సంధించిన ప్రశ్నపై ఆర్థిక మంత్రి స్పందించారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రం ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని నిర్మల సీతారామన్ తెలిపారు. గత ఆరేళ్లలో పన్నుల్లో వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి 85 వేల 13 కోట్లను కేంద్రం పంపిణీ […]
గత ఆరేళ్లలో తెలంగాణకు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలిచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిధుల వివరాలను లోక్‌సభలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో సంధించిన ప్రశ్నపై ఆర్థిక మంత్రి స్పందించారు.
2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రం ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని నిర్మల సీతారామన్ తెలిపారు. గత ఆరేళ్లలో పన్నుల్లో వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి 85 వేల 13 కోట్లను కేంద్రం పంపిణీ చేసిందనన్నారు. రాష్ట్రాల విపత్తుల నిధి కింద 1289.4 కోట్లు విడుదల చేశామని తెలిపారు. స్థానిక సంస్థల నిధుల కింద 6511 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు.
ప్రత్యేక సాయం కింద వెనుకబడిన జిల్లాలకు 1916 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 3853 కోట్లు విడుదల చేసిందని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ అయిడ్ కింద 51 వేల 299 కోట్లు విడుదల చేశామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 1500 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.