తిరుమలలో నకిలీ టికెట్ల గ్యాంగ్..తస్మాత్ జాగ్రత్త..

తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది నిత్యం స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అయితే జన్మధన్యమైనట్టే అని భావించే భక్తులు కోకొల్లలు. అయితే భక్తులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు. తాజాగా తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు నకిలీ టికెట్ల మాఫియా భక్తుల జేబులకు గండీ కొట్టాయి. అయినప్పటికి టీటీడీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తున్నారు. తాజాగా […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:21 pm, Mon, 10 February 20
తిరుమలలో నకిలీ టికెట్ల గ్యాంగ్..తస్మాత్ జాగ్రత్త..

తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది నిత్యం స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అయితే జన్మధన్యమైనట్టే అని భావించే భక్తులు కోకొల్లలు. అయితే భక్తులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు. తాజాగా తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నోసార్లు నకిలీ టికెట్ల మాఫియా భక్తుల జేబులకు గండీ కొట్టాయి. అయినప్పటికి టీటీడీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తున్నారు. తాజాగా నకిలీ అభిషేకం టికెట్లతో గుడిలోకి ప్రవేశించిన 14 మంది భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నెకి చెందిన ఓ గ్యాంగ్ నకిలీ టికెట్ల అమ్మకాలే టార్గెట్‌గా తిరుమలలో పనిచేస్తోంది. తాజాగా పట్టుబడ్డ భక్తులకు 14 నకిలీ టికెట్లను రూ. 73 వేలకు విక్రయించింది సదరు ముఠా. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద తనిఖీలు చేస్తుండగా..ఈ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఫేక్ గ్యాంగులపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటో..కొండ ఎక్కకముందే కేటుగాళ్లు నిలువదోపిడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.