కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన తండ్రి పుట్టినరోజు కోసం అధికారగణానికి, పార్టీ వర్గాలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున పర్యావరణం కోసం ప్రతినపూనునదామంటూ అధికారులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఒక్కరం ఒక మొక్క నాటుదామని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కెసీఆర్ జన్మదినం అన్న సంగతి […]

కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ బంపర్ ఆఫర్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 10, 2020 | 4:46 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన తండ్రి పుట్టినరోజు కోసం అధికారగణానికి, పార్టీ వర్గాలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున పర్యావరణం కోసం ప్రతినపూనునదామంటూ అధికారులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఒక్కరం ఒక మొక్క నాటుదామని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కెసీఆర్ జన్మదినం అన్న సంగతి అందరికీ తెలిసిందే. సీఎం బర్త్ డే సందర్భంగా హరితహారంలో భాగంగా ఒక్కో మొక్క నాటాలని ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కెసీఆర్ జన్మదిన సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తన 66వ సంవత్సరంలో కి అడుగుపెట్టనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రీన్ కవర్‌ని పెంచేందుకు పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మొక్కల పెంపకం పట్ల తన ఇష్టాన్ని గతంలో చాటుకున్నరన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ మేరకు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కోరారు.