‘మోదీజీ ! మీదే భారం !’..జపాన్ షిప్ నుంచి భారత సిబ్బంది అభ్యర్థన

కరోనా భయంతో తల్లడిల్లుతున్న తమను రక్షించాలని కోరుతున్నారు జపాన్ షిప్ లోని భారతీయులు కొందరు. ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ అని వ్యవహరించే ఈ నౌక ఈ నెల 5 నుంచి జపాన్ లోని రేవులోనే ఉంది. ఇందులో 3,700 మంది ప్రయాణికులు ఉండగా.. 160 మంది భారతీయులు. వీరిలో 66 మందికి కరోనా లక్షణాలు సోకాయట. వారి టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని  ఈ నౌక కెప్టెన్ ప్రకటించారు. ఈ ప్రయాణికులతో బాటు సిబ్బంది కూడా రెండు […]

'మోదీజీ ! మీదే భారం !'..జపాన్ షిప్ నుంచి భారత సిబ్బంది అభ్యర్థన
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2020 | 5:13 PM

కరోనా భయంతో తల్లడిల్లుతున్న తమను రక్షించాలని కోరుతున్నారు జపాన్ షిప్ లోని భారతీయులు కొందరు. ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ అని వ్యవహరించే ఈ నౌక ఈ నెల 5 నుంచి జపాన్ లోని రేవులోనే ఉంది. ఇందులో 3,700 మంది ప్రయాణికులు ఉండగా.. 160 మంది భారతీయులు. వీరిలో 66 మందికి కరోనా లక్షణాలు సోకాయట. వారి టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని  ఈ నౌక కెప్టెన్ ప్రకటించారు. ఈ ప్రయాణికులతో బాటు సిబ్బంది కూడా రెండు వారాలపాటు తప్పనిసరిగా నౌకలోనే దాదాపు ‘బందీలుగా’ ఉండాల్సి వస్తోంది. ఇందులోని షెఫ్ లలో నార్త్ బెంగాల్ కు చెందిన బినయ్ కుమార్ అనే షెఫ్.. తమకు సహాయం చేయాలనీ, కరోనా వైరస్ సోకినవారిని నౌక నుంచి వేరు చేయాలని ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రధాని మోదీని, ఐక్యరాజ్యసమితిని కోరారు.  తామంతా ఎంతో ఆందోళన చెందుతున్నామని ఆయన తెలిపారు. ఈ 66 మందిని మా నుంచి వేరు చేయండి.. అసలు మిగతావారినెవరిని కూడా టెస్ట్ చేయలేదు.. నాతో బాటు మరో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మమ్మల్ని సురక్షితంగా మా ప్రాంతాలకు చేర్చేలా చూడండి అని కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియో ద్వారా  అభ్యర్థన చేసిన వారంతా  ముఖాలకు తెల్లని  మాస్కులు ధరించి ఉన్నారు.  ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ నౌక గత జనవరి 20 న జపాన్ లోని యోకోహామా పోర్టుకు చేరింది.    అదేనెల 25 న హాంకాంగ్ వాసి ఒకరు నౌక నుంచి దిగిపోయాడు. అయితే అతనికి కరోనా వ్యాధి ఉందని ఈ నెల 2 న ఈ నౌకలోని సిబ్బందికి సమాచారం అందింది. దాంతో నౌకలోని వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.