AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూరప్‌లో కోరలు చాచిన కరోనా పిశాచి వైరస్‌ను అంటించిన బ్రిటన్‌ వ్యాపారి

  కరోనా పిశాచికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ప్రపంచదేశాల్లో భయానకాన్ని సృష్టిస్తోంది.. దేశదేశాలకు విస్తరిస్తోన్న ఈ మహమ్మారి యూరప్‌ దేశాలను కూడా వదలడం లేదు.. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో సుమారు ఏడుగురు కరోనాతో బాధపడుతున్నారట! అసలు వైరస్‌ రావడానికి ముఖ్య కారకుడు ఓ బ్రిటిష్‌ వ్యాపారవేత్త అట! అతడెవ్వరన్నది మాత్రం ఇంగ్లాండ్‌ వైద్యాధికారులు చెప్పడం లేదు.. ఆ వ్యాపారికి ఓ 50 ఏళ్లు ఉంటాయట! ఈ ముదనష్టపు రోగాన్ని అంటించినవారెవ్వరో చెప్పాలంటూ వైద్యాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రజలు.. […]

యూరప్‌లో కోరలు చాచిన కరోనా పిశాచి వైరస్‌ను అంటించిన బ్రిటన్‌ వ్యాపారి
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:52 PM

Share

కరోనా పిశాచికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ప్రపంచదేశాల్లో భయానకాన్ని సృష్టిస్తోంది.. దేశదేశాలకు విస్తరిస్తోన్న ఈ మహమ్మారి యూరప్‌ దేశాలను కూడా వదలడం లేదు.. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో సుమారు ఏడుగురు కరోనాతో బాధపడుతున్నారట! అసలు వైరస్‌ రావడానికి ముఖ్య కారకుడు ఓ బ్రిటిష్‌ వ్యాపారవేత్త అట! అతడెవ్వరన్నది మాత్రం ఇంగ్లాండ్‌ వైద్యాధికారులు చెప్పడం లేదు.. ఆ వ్యాపారికి ఓ 50 ఏళ్లు ఉంటాయట! ఈ ముదనష్టపు రోగాన్ని అంటించినవారెవ్వరో చెప్పాలంటూ వైద్యాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు ప్రజలు.. అయినా వారు పెదవి విప్పకపోవడంతో ఆ వ్యాపారవేత్తను గ్రేట్‌ స్ప్రెడ్డర్‌గా పిలుచుకుంటున్నారు.. సింగపూర్‌లోని గ్రాండ్‌ హయత్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరైన ఆ బిజినెస్‌మన్‌కు అక్కడే కరోనా వైరస్‌ సోకిందంటున్నారు.. ఆ గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ పోయిన్నెల 28వ తేదీన స్కై చాలెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ లోకల్‌ ప్లేన్‌లో మాంట్‌ బ్లాంక్‌కు వెళ్లాడు.. ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన అయిదుగురు బ్రిటీషర్లకు కూడా కరోనా అంటుకుంది.. మొన్న గురువారంనాడు గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ లండన్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాగానే జబ్బు ముదిరిపోయింది… వెంటనే అతడిని లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స ఇస్తున్నారు.. ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పడం లేదు.. అయితే సింగపూర్‌లో మౌంట్‌బ్లాంక్‌లో గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ కారణంగా జబ్బు పడిన అయిదుగురు బ్రిటీషర్లు మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గ్రేట్‌ స్ప్రెడ్డర్‌ బస చేసిన మాంట్‌బ్లాంక్‌లో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆ రోజున ఆయనతోపాటే అక్కడ్నుంచి ఉంచిన ఈజీ జెట్‌ విమానాన్ని, ఆరుగురు విమాన సిబ్బందిని, అందులో ట్రావెల్‌ చేసిన 183 మంది ప్రయాణికులను అధికారులు గుర్తించారు. తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిందిగా వారిని హెచ్చరించారు. బ్రిటన్‌కు వచ్చేటప్పుడు ఆ విమానం ఫ్రాన్స్‌ మీదుగా స్పెయిన్‌కు వెళ్లి వచ్చిందట! ఆ దేశాలలో దిగిన ఇద్దరు ప్రయాణికులకు కూడా కరోనా వైరస్‌ సోకిందట!

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..