AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulab Cyclone Updates: వాహనాలపై ప్రయాణాలు చేయొద్దు, ఎత్తైన ప్రదేశాలు.. చెట్ల కింద ఉండొద్దు. ఉత్తరాంధ్రలో గులాబ్ గుబులు

గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గంట గంటకు తుఫాను తీవ్రత జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా

Gulab Cyclone Updates: వాహనాలపై ప్రయాణాలు చేయొద్దు, ఎత్తైన ప్రదేశాలు.. చెట్ల కింద ఉండొద్దు. ఉత్తరాంధ్రలో గులాబ్ గుబులు
Venkata Narayana
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 26, 2021 | 9:09 AM

Share

Gulab Cyclone: గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గంట గంటకు తుఫాను తీవ్రత జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసిన అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇవాళ సాయంత్రానికి గులాబ్‌ తుఫానుగా మారనుంది. వాతావరణశాఖ హెచ్చరికలతో అటు ఒడిశా- ఇటు ఆంధ్రా తీరప్రాంతాలకు తుఫాను ముప్పు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం 4నుంచి 5గంటల సమయంలో విజయనగరం కళింగపట్నం ఈశాన్య దిశకు 440కి.మీ దూరంలో లేదా ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు అగ్నేయ దిశలో 370 కి.మీటర్ల దూరంలో తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణకేంద్రం ముంది.

గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో విజయనగరం జిల్లాలో ఇప్పటికే సుమారు 53.75మి.మీ వర్షపాతం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, ఉభయగోదావరి గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 27.25 నుంచి 76 మి.మీ. వరకు వర్షం కురిసింది. గులాబ్‌ తుఫాను ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రలో గంటకు 75 నుంచి 95 కి.మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. దీంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ కేంద్రం. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధికారులు.

గులాబు తుఫాన్‌ తీవ్రవాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అధికారులు తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు. ఎవరూ వాహనాలపై ప్రయాణాలు చేయవద్దని…ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని సూచించారు. రాబోయే విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు అన్నీ శాఖల అధికారులు తగిన సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు జిల్లా కలెక్టర్.

ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో తుఫాను ప్రభావం అధికంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు కోస్తాపై కూడా ప్రభావం చూపనుంది. తుఫాను హెచ్చరికలతో ఉత్తరాంద్రలోని ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసులు బిక్కుబిక్కు మంటున్నారు. మూడు జిల్లాల్లో తీర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు.

వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. 3జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అత్యవసర కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. SDRF, NDRF బృందాలను తుఫాను తాకనున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని తుఫాను పునరావస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం విపత్తు నిర్వహణశాఖ అధికారులు ఏపీకి మూడు, ఒడిశాలకు 15 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించారు.మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేసారు. రేపటి వరకు ఎవరూ సముద్రవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Read also: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. సీఎం జగన్ స్థానంలో డిప్యూటీ సీఎం సుచరిత

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ