తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. సీఎం జగన్ స్థానంలో డిప్యూటీ సీఎం సుచరిత

నేడు ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. సీఎం జగన్ స్థానంలో డిప్యూటీ సీఎం సుచరిత
Amit Shah

Amit Shah Meeting: నేడు ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాలు హాజరు కానున్నాయి. సమావేశానికి తెలుగురాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సుచరిత హాజరుకానున్నారు. ఏపీ సీఎం జగన్‌కు అస్వస్థత ఏర్పడ్డంతో ఆకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకుని తన స్థానంలో డిప్యూటీ సీఎంను హాజరు కావాలని ఆదేశించారు.

ఏపీ, తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, యూపీ, బెంగాల్ రాష్ట్రాలు హాజరు కానున్న ఈ భేటీలో తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించనున్నాయి ఆయా రాష్ట్రాలు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను మూడేళ్ల క్రితం 100 నుంచి 70కి తగ్గించిన కేంద్రం.. కేవలం 25 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

2014 నుంచి వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు 47% తగ్గాయని చెబుతున్న హోంశాఖ.. సమావేశంలో తొలి అర్థభాగం భద్రతాపరమైన అంశాలపై చర్చంచే అవకాశం కనిపిస్తోంది. రెండో అర్థభాగంలో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ.. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లు, భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలు, మావోయిస్టుల నిధుల సమీకరణకు అడ్డుకట్ట, రాష్ట్రాల పోలీసులతో పాటు ఈడీ, ఎన్ఐఏ సంస్థల దర్యాప్తు, ప్రాసిక్యూషన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు స్పెషల్ ఫోర్సెస్ విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహాయం, సమన్వయం అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర హోంశాఖతో పాటు రవాణా, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, టెలీకాం సేవల కవరేజి కోసం టెలీకాం మంత్రిత్వశాఖ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ – గిరిజనుల కోసం ‘ఏకలవ్య’ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సులో ప్రజేంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

Read also: Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu