AP CM Jagan: తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు..

AP CM Jagan: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఈ తుపానుకు

AP CM Jagan: తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు..
Ap Cm Jagan
Follow us
uppula Raju

|

Updated on: Sep 25, 2021 | 7:58 PM

AP CM Jagan: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఈ తుపానుకు గులాబ్‌గా నామకరణం చేశారు. ఆదివారం సాయంత్రం కళింగపట్నం వద్ద తుపాను సముద్రతీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి అలర్ట్ అయ్యారు. తుపాను పరిస్థితులపై సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంచేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు.

గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరందాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ తుఫాన్ ప్రభావంతో త్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. అటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. మత్సకారులు ఈ నెల 27వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్‌ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 75 నుంచి 85 కిలో మీటర్లు, గరిష్టంగా 95 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

PM Modi UNGA: ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లి లాంటిది: అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

Hyderabad: పని మనుషులుగా నమ్మించారు.. అదునుచూసి ఇళ్లు కొల్లగొట్టారు.. కానీ చివరకు పోలీసులకు చిక్కారు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!