Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పని మనుషులుగా నమ్మించారు.. అదునుచూసి ఇళ్లు కొల్లగొట్టారు.. కానీ చివరకు పోలీసులకు చిక్కారు..

Hyderabad: పని మనుషులుగా ఇంట్లో చేరి అందరిని నమ్మించారు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఇంట్లో ఎవరు లేని సందర్భం చూసి చోరీకి తెగబడ్డారు.

Hyderabad: పని మనుషులుగా నమ్మించారు.. అదునుచూసి ఇళ్లు కొల్లగొట్టారు.. కానీ చివరకు పోలీసులకు చిక్కారు..
Telecom Nagar Robbery
Follow us
uppula Raju

|

Updated on: Sep 25, 2021 | 7:33 PM

Hyderabad: పని మనుషులుగా ఇంట్లో చేరి అందరిని నమ్మించారు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఇంట్లో ఎవరు లేని సందర్భం చూసి చోరీకి తెగబడ్డారు. యజమాని వచ్చేలోపు అక్కడి నుంచి ఉడాయించారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌ గచ్చిబౌలి టెలికాంనగర్‌లో జరిగిన చోరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మీడియా సమావేశంలో నిందితులను చూపి వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్‌లో నివాసం ఉండే గోవింద రావ్ తన ఇంట్లో చోరీ జరిగిందని ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు నేపాల్‌కి చెందిన లంక బహదూర్ సాహి అతని భార్య పవిత్రగా గుర్తించారు. వీరిని సోలాపూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 7 లక్షల 23 వేల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు గత ఐదు నెలల క్రితం గోవిందా రావ్ ఇంట్లో పని మనుషులుగా చేరారు. నమ్మకంగా వ్యవహరించారు. ఈ నెల18 న గోవింద రావు అతని ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీశైలం వెళ్లారు. వెళ్తూ వెళ్తూ సర్వెంట్స్‌కి రెండు రోజులు ఇంటికి రాను ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అయితే 19 వ తేదీ లక్ష్మణ్‌కి కాల్ చేస్తే రెస్పాండ్ లేదు. దీంతో అనుమానం వచ్చిన గోవిందరావ్ స్నేహితులను ఇంటికి పంపాడు. ఆ సమయంలో అక్కడ సర్వెంట్ ఉండే ఇల్లు ఖాళీగా కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూస్తే కిటికీ గ్రిల్స్ తొలగించినట్లు తేలింది. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.

చోరీ చేయడానికి ముందు నిందితులు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. నిందితులను పట్టుకోవడం కోసం నాలుగు టీం లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం ప్రకారం.. సోలాపూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశామని తెలిపారు. డైరెక్ట్ నేపాల్ కు వెళ్లకుండా సోలాపూర్ లో కొంతకాలం ఉండి ఆపై నేపాల్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యమ్లాల్ అనే వ్యక్తి ఈ నిందితులిద్దరిని గోవింద్ దగ్గర పనికి కుదిర్చారు. యమ్లాల్ పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని, ప్రస్తుతం అతను నేపాల్ లో ఉన్నాడని పోలీసులు వివరించారు.

SSC MTS Admit Card 2021: SSC MTS పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేయాలో తెలుసుకోండి..

Shiva Nirvana : అందమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ… ఆ హీరో కోసమేనా..

ఈ TVS స్కూటర్ 30 వేలు మాత్రమే..! సంవత్సరం వారంటీ మనీ బ్యాక్ గ్యారెంటీ..