SSC MTS Admit Card 2021: SSC MTS పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ ఎలా చేయాలో తెలుసుకోండి..
SSC MTS Admit Card 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS అడ్మిట్ కార్డ్ 2021ని విడుదల చేసింది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి రూల్ నెంబర్,
SSC MTS Admit Card 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS అడ్మిట్ కార్డ్ 2021ని విడుదల చేసింది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి రూల్ నెంబర్, పుట్టిన తేదీ సమర్పించడం ద్వారా అడ్మిట్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. MTS పేపర్ I పరీక్ష అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహిస్తారు.
SSC MTS అడ్మిట్ కార్డ్ 2021 ఎలా డౌన్‌లోడ్ చేయాలి 1. అభ్యర్థులు తమ ప్రాంతంలోని SSC వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. 3. మీ రూల్ నంబర్, పుట్టిన తేదీని సమర్పించాలి. 4. అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది. 5. డౌన్‌లోడ్ చేసుకోండి. 6. పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడానికి ప్రింట్ అవుట్ తీసుకోండి.
SSC నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్షలో రెండు పేపర్‌లు ఉంటాయి పేపర్ I, పేపర్ II. పేపర్ I కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పేపర్ II ఒక వివరణాత్మక పరీక్ష. పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. మార్కుల పునర్ మూల్యాంకనం/రీ-చెకింగ్ వంటి ఎలాంటి సదుపాయాలు ఉండవు. ప్రతి యేటా ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలు, విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే పదో తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు.