AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రైవ‌ర్ క‌దా అని న‌మ్మితే.. ఓన‌ర్‌కే టోపీ పెట్టాడు. సంచ‌ల‌నంగా మారిన రూ. 55 ల‌క్ష‌ల న‌గ‌దు చోరీ కేసు..

Hyderabad: ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఇటీవ‌ల కోకాపేట‌లో స్థ‌లం కొన్నాడు. ఈ క్ర‌మంలో స్థ‌లం య‌జ‌మానికి డ‌బ్బులు ఇచ్చిర‌మ్మ‌ని డ్రైవ‌ర్‌కు క్యాష్ ఇచ్చి పంపించాడు. కానీ డ్రైవ‌ర్ డ‌బ్బులు ఇవ్వ‌క‌పోగా..

Hyderabad: డ్రైవ‌ర్ క‌దా అని న‌మ్మితే.. ఓన‌ర్‌కే టోపీ పెట్టాడు. సంచ‌ల‌నంగా మారిన రూ. 55 ల‌క్ష‌ల న‌గ‌దు చోరీ కేసు..
Narender Vaitla
| Edited By: Phani CH|

Updated on: Sep 26, 2021 | 7:30 AM

Share

Hyderabad: ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఇటీవ‌ల కోకాపేట‌లో స్థ‌లం కొన్నాడు. ఈ క్ర‌మంలో స్థ‌లం య‌జ‌మానికి డ‌బ్బులు ఇచ్చిర‌మ్మ‌ని డ్రైవ‌ర్‌కు క్యాష్ ఇచ్చి పంపించాడు. కానీ డ్రైవ‌ర్ డ‌బ్బులు ఇవ్వ‌క‌పోగా..క‌నిపించ‌కుండా పోయాడు. ఆ డ‌బ్బు ఏకంగా రూ. 55 ల‌క్ష‌లు కావ‌డంతో ప్ర‌స్తుతం ఈ వార్త సంచ‌ల‌నంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. సంతోష్ రెడ్డి అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కోకాపేట‌లో స్థ‌లం కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన డ‌బ్బును కోకాపేట‌లో నివాసం ఉంటున్న స్థ‌ల య‌మ‌జానికి ఇవ్వ‌మ‌ని డ్రైవ‌ర్ శ్రీనివాస్‌కు రూ. 55 ల‌క్ష‌ల‌తో పాటు త‌న బెంజ్ కారును ఇచ్చి పంపించాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం శ్రీనివాస్ కారులో డ‌బ్బులు తీసుకొని బ‌య‌లు దేరాడు. అయితే ఈ క్ర‌మంలోనే కొంత దూరం వెళ్లిన త‌ర్వాత సంతోష్ ఎందుకో శ్రీనివాస్‌కు కాల్ చేయ‌గా ఫోన్ స్వీచ్ఛాఫ్ వ‌చ్చింది.

కంటిన్యూగా ఫోన్ ఆఫ్ రావ‌డంతో అనుమానం వ‌చ్చిన సంతోష్ త‌న డ్రైవ‌ర్ కోకాపేట‌కు వెళ్ల‌లేద‌ని తెలుసుకొని.. డ్రైవర్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో సంతోష్ రెడ్డి బెంజ్ కార్ ను వదిలేసి డబ్బులు తీసుకొని డ్రైవర్ శ్రీనివాస్ పరారైనట్లు గుర్తించారు. సంతోష్ రెడ్డి వద్ద 6 నెలల నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్.. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ డ‌బ్బును చోరీ చేశాడా.? లేదా అత‌నిని ఎవ‌రైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad: పని మనుషులుగా నమ్మించారు.. అదునుచూసి ఇళ్లు కొల్లగొట్టారు.. కానీ చివరకు పోలీసులకు చిక్కారు..

లేటు వయసులో భాగస్వామి దొరికిందని ఆనందపడ్డాడు.. రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే సీన్ రివర్స్

Telangana: కిరాతకుడు.. పింఛను డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా చంపేశాడు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..