AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కిరాతకుడు.. పింఛను డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా చంపేశాడు

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిని కన్నకొడుకే అత్యంత కిరాతకంగా చంపేశాడు. పరిగి మండలం ఖుదావాన్​పూర్​‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana: కిరాతకుడు.. పింఛను డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా చంపేశాడు
Murder
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2021 | 2:46 PM

Share

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిని కన్నకొడుకే అత్యంత కిరాతకంగా చంపేశాడు. పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు.  కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు వెల్లడించారు. తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను నిత్యం వేధించేవాడని చెప్పారు.  శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పెన్షన్ డబ్బు రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పెన్షన్ డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.

చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. అసలేం జరిగింది

నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో రెండు డెడ్‌బాడీలను గ్రామస్థులు చూశారు. మృతులు తల్లి, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాలతో సూసైడ్ చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: పని కోసమంటూ వచ్చారు.. కిలో బంగారం, రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు.. షాకింగ్ విజువల్స్ మీకోసం..

భార్యాభర్తల మధ్య గొడవ.. తల్లి ఒడిలోని పసికందు మృతి..

Follow Us
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ