Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్యాభర్తల మధ్య గొడవ.. తల్లి ఒడిలోని పసికందు మృతి.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి మరో దారుణం

హైదరాబాద్ మహా నగరంలో దారుణం వెలుగు చూసింది. అలు మగల గొడవతో ఓ బిడ్డ ప్రాణం పోయింది. సైదాబాద్ పరిధిలోని పూసలబస్తీలో దారుణం చోటుచేసుకుంది.

Crime News: భార్యాభర్తల మధ్య గొడవ.. తల్లి ఒడిలోని పసికందు మృతి.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి మరో దారుణం
Baby Died
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 25, 2021 | 1:32 PM

హైదరాబాద్ మహా నగరంలో దారుణం వెలుగు చూసింది. అలు మగల గొడవతో ఓ బిడ్డ ప్రాణం పోయింది. సైదాబాద్ పరిధిలోని పూసలబస్తీలో దారుణం చోటుచేసుకుంది. . మద్యం మత్తులో ఉన్న భర్త.. భార్యల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్యపై చేయిచేసుకున్నాడు. భార్యను కొడుతున్న క్రమంలో 22 రోజుల పసికందు చనిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ పూసలబస్తీ పరిధిలోని క్రాంతి నగర్‌బస్తీకి చెందిన పొదిల రాజేష్‌(36), జాహ్నవి (25) దంపతులు. రాజేష్‌ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ మద్యం తాగారు. మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవకు దిగారు. ఆవేశంలో భర్త ప్లాస్టిక్‌ పైపుతో భార్య మీద దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో ఆమె..తన ఒడిలో 22 రోజుల శిశువును అడ్డుగా పెట్టింది. ఈ గొడవలో చిన్నారి కంటిపై దెబ్బతగిలింది. భార్య తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును గట్టిగా పట్టుకుంది. దీంతో పసికందు ఊపిరాడకపోవడంతో అపస్మారకస్థితికి చేరింది. ఇది గమనించిన స్థానికులు.. శిశువును హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, పాప పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం.. (ఐదు నెలల బాబు)ను మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో ఉంచారు. రెండో కుమారుడు వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల్లిదండ్రులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Viral Video: దారిన పోతున్న ఆవు దగ్గర పాలకు వెళ్లిన పంది.. ఆగిమరీ పాలు ఇచ్చిన గోమాత.. వీడియో వైరల్