Cyber Crime: బిట్ కాయిన్ చీటర్స్ ముఠా వలలో పడిన యువకుడు.. ఎంత పోగొట్టుకున్నాడో తెలుసా?
రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలను పోలీసులు ఎంత హెచ్చరించినా వారు సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఆన్ లైన్ ప్రకటనలు చూసి టెమ్ట్ అవుతున్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలను పోలీసులు ఎంత హెచ్చరించినా వారు సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. ఆన్ లైన్ ప్రకటనలు చూసి టెమ్ట్ అవుతున్నారు. అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకుంటున్నారు. రోజూ వార్త పత్రికలు, టీవీల్లో సైబర్ నేరాల గురించిన వచ్చినా వారు మోసపోతూనే ఉన్నారు. తాజాగా అంబర్ పేటకు చెందిన ఓ వ్యక్తి బిట్ కాయిన్ చీటర్స్ ముఠా వలలో పడి 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లోని అంబర్ పేటకు చెందిన నరేష్ ను సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేశారు. అతనితో కే-కీయున్ యాప్ డౌన్ లోడు చేయించారు. బైనాన్స్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసి కే-కాయిన్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని నరేష్ ను నమ్మించారు. ఇది నమ్మిన నరేష్.. పలు విడతల్లో 8 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఎనిమిది లక్షలు పెట్టినా ట్రేడింగ్ చేయడానికి అవకాశం రావటం లేదని నరేష్ వారిని అడిగారు. వారు మరింత డిపాజిట్ చేయాలని నరేష్ పై ఒత్తిడి తెచ్చారు. ఇదేదో తేడా కొడుతున్నట్లుగా భావించిన నరేష్ సైబర్ నేరగాళ్లను నిలదీశారు.
నరేష్ కు విషయం అర్థమైపోయిందని భావించిన కేటుగాళ్ల నరేష్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు యాప్ లింక్ ను డిలిట్ చేశారు. నరేష్ వారికి ఎంత ఫోన్ చేసినా కలవకపోటంతో మోసపోయానని గ్రహించాడు. పోలీస్ స్టేషన్ బాట పట్టి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరా నేరాలపై ఎంత అవగాహన కల్పించినా కొంత మంది మోసపోతూనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. చాలా మంది అంత అయిపోయక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. వాళ్లు ఫిర్యాదు చేసే లోపే సైబర్ నేరగాళ్లు అలర్ట్ అయి దొరకడం లేదని చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తు అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..
Viral Video: భారీ అనకొండల మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి.. వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.!