Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేటు వయసులో భాగస్వామి దొరికిందని ఆనందపడ్డాడు.. రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే సీన్ రివర్స్

లైఫ్ సీనియర్ సిటిజన్ స్టేజ్‌కు దగ్గర్లో ఉంది. ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. 49 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు.

లేటు వయసులో భాగస్వామి దొరికిందని ఆనందపడ్డాడు..  రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే సీన్ రివర్స్
Marriage Cheating
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2021 | 7:22 PM

లైఫ్ సీనియర్ సిటిజన్ స్టేజ్‌కు దగ్గర్లో ఉంది. ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. 49 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. తన అభీష్టానికి అనుకుణంగా  ఓ మహిళ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడంతో ఫుల్ ఖుష్ అయ్యాడు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టాడు. కట్ చేస్తే… రూ.4.89 లక్షలు వసూలు చేసిన పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు, పత్తా లేకుండా పోయారు. దీంతో అతడు షాకయ్యాడు.  గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితుడు రెండో పెళ్లి కోసం మూడు నెలల కిందట వివిధ మ్యారేజ్‌ బ్యూరోలను సంపద్రించాడు. నెల తర్వాత పింద్రోతు శివయ్య అనే వ్యక్తి కాల్‌ చేశాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ మ్యారేజ్‌ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానంటూ వివరాలు చెప్పాడు. ఈ ఏడాది జులై 5న కొందరు మహిళల ఫోటోలు వాట్సాప్‌లో పంపించాడు. నచ్చలేదని బాధితుడు చెప్పడంతో అదే నెల 10న మరికొందరివి సెండ్ చేశాడు. అప్పుడు కూడా అదే ఆన్సర్ రావడంతో శివయ్య.. రెండ్రోజుల తర్వాత ఒకే ఒక్క ఫొటో పంపించాడు. ఆమె నచ్చిందని.. ఇతర వివరాలు పంపించాలని బాధితుడు కోరాడు. ఆమెది విజయనగరం జిల్లా అని.. వారికి మీరు నచ్చారని శివయ్య చెప్పుకొచ్చాడు.

 బాధితుడు, ఆమె పోన్లో మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు ఆమె తల్లి కూడా అతడితో మాట కలిపింది. సంబంధం ఖాయం చేసిన తర్వాత .. పెళ్లికెలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఆమె కుటుంబం చేసిన అప్పులు తీర్చాలని శివయ్య సూచించాడు. కాబోయే భార్యనే కదా అని బాధితుడు పలు దఫాలుగా రూ.4.89 లక్షలు పంపించాడు. ఈ ఏడాది ఆగస్టు 25న రాత్రి 10.52 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫంక్షన్‌ హాల్‌ కూడా మంచిది బుక్ చేశాడు. అనతరం పెళ్లికి ఎంత మంది వస్తారు..? అంటూ ఆరా తీసేందుకు పెళ్లికి రెండ్రోజుల ముందు బాధితుడు శివయ్యకు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యుల నంబర్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. చివరకు తాను మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రి-రిలీజ్ వేడుకను దిగువన చూడండి 

Also Read: ‘త్వరలో ఏపీ కేబినెట్‌లో మార్పులు.. వంద శాతం కొత్తవారే’

తుఫాన్‌కు ‘గులాబ్’ అని నామకరణం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన