Cyclone Gulab: తుఫాన్‌కు ‘గులాబ్’ అని నామకరణం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ అలెర్ట్ వచ్చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం… నిన్న సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ అలెర్ట్ వచ్చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం… నిన్న సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ, కళింగపట్నానికి 740 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రవాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుంది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి శనివారం మధ్యాహ్ననికి తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్‌ను ‘గులాబ్’ అని పేరు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు విపత్తలు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ విధ్వసం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ ఒడిశా తీరంలో 13, ఉత్తరాంధ్ర తీరాలలో 5 ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలను రంగంలోకి దించారు. మత్సకారులు ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
Also Read: ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి