Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: అకస్మాత్తుగా రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి… కానీ అంతలోనే ఊహించని విషాదం

గుంటూరు జిల్లాలో మొసలి హల్‌చల్ చేసింది. కానీ దాని ఫేట్ బాగోలేదు. అదే సమయంలో అటుగా ఓ లారీ వచ్చింది.

Guntur: అకస్మాత్తుగా రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి... కానీ అంతలోనే ఊహించని విషాదం
Crocodile Spotted
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2021 | 5:20 PM

గుంటూరు జిల్లాలో హల్‌చల్ చేసింది. కానీ అంతలోనే లారీ కింద పడి ప్రాణాలు విడిచింది. రాజుపాలెం మండలం అనుపాలెం చప్టా దగ్గర లారీ కింద పడి మొసలి ప్రాణాలు విడిచింది. వాగులో నుండి మొసలి రోడ్డుపైకి రావడంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వాగులో నుండి మొసలి రావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని మొసళ్ళు ఉన్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదల్లో కొట్టుకుని వచ్చి ఉండొచని స్థానికులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అడవి ఉడుము అని పట్టుకుంటే….

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది.  అతడు అడవి ఉడుమ‌ని భావించి కర్రతో కొట్టి, సంచిలో వేసుకుని ఫ్రెండ్స్ తెలియజేశాడు. వాటాలు వేసుకొని తినవచ్చని సమాచారం ఇచ్చాడు. దానిని తీసుకు వచ్చి సంచి నుంచి బయటికి తీసేసరికి అది మొసలి.  రాజ‌మండ్రి శివారు కాతేరు గామాన్ బ్రిడ్జి అవతల రెల్లి గడ్డలంకలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.  కాతేరుకు చెందిన ఒక రైతు బుధవారం తెల్లవారుజామున రెల్లి గడ్డ లంకలోకి పశువులకు మేత వెయ్యటానికి రాత్రి పూట దొడ్డి వద్దకు వెళ్ళాడు. అక్కడ మొసలి పశువుల కొట్టం వద్ద సంచరిస్తోంది. దానిని అడివి ఉడుము అని భావించి కర్రతో కొట్టాడు. ఆపై దాన్ని సంచిలో వేసి.. స్నేహితులకు సమాచారం అందించాడు. దానిని గ్రామం వద్ద బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి సంచి విప్పేసరికి తెల్లవారిపోయింది. తీరా అది చూస్తే మొసలి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణాలతో ఉన్న ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

Also Read: కిరాతకుడు.. పింఛను డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా చంపేశాడు