Andhra Pradesh: ఏపీకి తుఫాన్ ముప్పు.. మరో 3 రోజులు పాటు, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం... నిన్న సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది.

Andhra Pradesh: ఏపీకి తుఫాన్ ముప్పు.. మరో 3 రోజులు పాటు, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Ap Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2021 | 4:06 PM

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం… నిన్న సాయంత్రంకు వాయుగుండంగా, తదుపరి తీవ్ర వాయుగుండంగా బలపడింది. గడచిన ఆరు గంటలలో ఇది 14 kmph వేగంతో పశ్చిమ దిశగా ప్రయాణించింది.  ఈరోజు(25.09.2021) ఉదయం 08:30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో 18.4°N అక్షాంశము, 89.3°E రేఖాంశము వద్ద కేంద్రీకృతమైంది.  గోపాల్ పూర్(ఒడిస్సా) కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమిటర్ల దూరములో, కళింగ పట్టణం(ఆంధ్రప్రదేశ్) నకు తూర్పు-ఈశాన్య దిశగా 540 కిలోమీటర్ల దూరములలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 6 గంటలకు తుఫానుగా బలపడే అవకాశం ఉంది.  ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రేపు సాయంత్రంకు ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలలో విశాఖపట్టణం & గోపాల్‌పూర్ ల మధ్య సుమారుగా కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తుల మధ్య నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.

వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ————————————————— ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీవర్షాలు… అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు; అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

Also Read: Guntur: అకస్మాత్తుగా రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి.. కానీ అంతలోనే ఊహించని విషాదం