AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ TVS స్కూటర్ 30 వేలు మాత్రమే..! సంవత్సరం వారంటీ మనీ బ్యాక్ గ్యారెంటీ..

TVS Scooter: దేశంలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు చాలామంది ఎలక్ట్రిక్‌ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో

ఈ TVS స్కూటర్ 30 వేలు మాత్రమే..! సంవత్సరం వారంటీ మనీ బ్యాక్ గ్యారెంటీ..
Tvs Wego
uppula Raju
|

Updated on: Sep 25, 2021 | 6:29 PM

Share

TVS Scooter: దేశంలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు చాలామంది ఎలక్ట్రిక్‌ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పెట్రోల్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో కూడా తక్కువ ధరలో మంచి మైలేజ్‌నిచ్చే వాహనాల కోసం వెతుకుతున్నారు. తాజాగా సెకండ్ హ్యాండ్ బైక్‌లని విక్రయించే బైక్ 24 లో చౌకైన టీవీఎస్ స్కూటర్ ఒకటి ఉంది. ఇది కేవలం రూ. 30 వేలకే లభిస్తుంది. దీని గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి TVS Wego షోరూం ధర రూ .55098. ఈ స్కూటర్‌లో 110 cc ఇంజిన్ ఉంటుంది. ఇది 48 kmpl మైలేజ్ ఇస్తుంది. కానీ బైక్ 24 లో 30 వేలకే లభిస్తుంది. ఈ స్కూటర్ 53 వేల కిలోమీటర్లు నడిచింది. 2013 మోడల్.. ఢిల్లీ RTO లో నమోదై ఉంది. మీరు ఈ స్కూటర్‌ని కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం వారంటీతో పాటు 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది. అంటే మీకు ఈ స్కూటర్ 7 రోజుల్లోపు నచ్చకపోతే మీరు దానిని తిరిగి వెనక్కి ఇచ్చే సదుపాయం ఉంది. అంతేకాదు మీ పూర్తి డబ్బు తిరిగి పొందవచ్చు.

TVS వీగో ఇతర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ స్కూటర్‌లో డిస్క్, డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అందించారు. అలాగే ట్యాంకులో 5 లీటర్ల వరకు వరకు ఇంధనం నింపొచ్చు. సెల్ప్‌ సిస్టంతో పాటు డ్రమ్‌ సిస్టమ్ ఎంపిక ఉంది. చక్రాలు వీల్స్ కలిగి ఉంటాయి. బైక్ 24 వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్కూటర్‌ని పూర్తిగా తనిఖీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేవని ధృవీకరించారు. పూర్తి సమాచారం కోసం బైక్ 24 వెబ్‌సైట్‌ని సందర్శించగలరు.

ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే పండగే.. అమ్మాయి పుడితే ఘనంగా వేడుకలు జరుపునే గ్రామం మన దగ్గరే.. ఎక్కడంటే..

Republic Pre-Release Event Live Video: సాయి ధరమ్ తేజ్‌ కోసం భీమ్లా నాయక్… రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో)

EPF Customers Alert: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. UANతో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!