ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే పండగే.. అమ్మాయి పుడితే ఘనంగా వేడుకలు జరుపునే గ్రామం మన దగ్గరే.. ఎక్కడంటే..
ఆడపిల్ల పుడితే ఇప్పటికీ భారంగా భావిస్తుంటారు. అమ్మాయి పుట్టింది అనగానే.. పెదవి విరుస్తుంటారు. తమపై దించుకోలేని భారం ఉందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే..

ఆడపిల్ల పుడితే ఇప్పటికీ భారంగా భావిస్తుంటారు. అమ్మాయి పుట్టింది అనగానే.. పెదవి విరుస్తుంటారు. తమపై దించుకోలేని భారం ఉందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే.. సంతోషం కంటే.. ఎక్కువగా విసుక్కుంటారు. ఆడపిల్ల పుడితే అరిష్టమని మనకిది శాపమని భావిస్తున్న వారి సంఖ్య తక్కవేమి కాదు.. దీనికి తోడు మగ పిలగాడు పుడితే వారసుడు వచ్చడంటూ సంబరాలు జరుపుకుంటారు చాలా మంది. అబ్బాయి పుడితే ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీలవుతుంటారు. అమ్మాయి కంటే.. అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. ఈ వివక్షత ప్రస్తుతం అనేక చోట్ల ఉంది. అయితే ఆడపిల్ల పుడితో అక్కడ మాత్రం ఓ పండగ..ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ఊరంతా ఒక్కచోట చేరి ఘనంగా వేడుక చేసుకుంటారు. ఆడపిల్ల పుడితే ఆ గ్రామమంతా ఏకమై పండుగ చేసుకుంటు, ఎంతో ఆనందంతో ఉంటూ మిగతా వారికి.. అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ గ్రామస్థులు.. అమ్మాయి పుట్టగానే ఊరంతా రంగులేసి సంబరాలు చేసుకుంటున్న ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందామా.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాస్ పూర్ అనే గ్రామం. ఇక్కడ అమ్మాయి పుడితే అందరు కలిసి పండగ చేసుకుంటారు. అమ్మాయిని అరిష్టంగా కాకుండా.. అదృష్టంగా భావిస్తారు. ఇంత మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఆ గ్రామాన్ని ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచనతో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ 2019లో దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ గ్రామ స్వరూపమే మారిపోతుంది గ్రామం అంటే హరిదాసుపూర్లా ఉండాలనే అలోచన అందరిలో కలిగేలా చేశారు. వినూత్న ఆలోచనలతో గ్రామస్థులు తమ గ్రామాన్ని నిత్య నూతనంగా మల్చుకుంటున్నారు.
అయితే ఆ గ్రామంలో ఓ కుటుంబంలోని దంపతులకు మూడో సంతానం కూడా ఆడపిల్లనే పుట్టింది. దాంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశకు లోనైంది. మళ్లీ ఆడిపిల్ల అంటూ పెదవి విరిచారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ సర్పంచ్ షఫీ ఆడపిల్ల శాపం కాదు అదృష్టంగా భావించాలంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికి పుట్టిన బిడ్డకు పెద్ద వేడుక నిర్వహించాడు.. దీనితో గ్రామంమంతా ఏకమై ఆ వేడుకలో పాల్గొంది..ఊరంతా స్వీట్లు పంచారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ దీపాలను అలంకరించారు. ఆదర్శ సంప్రదాయానికి నాంది పలికారు. గత సంవత్సర కాలానికి పైగా ఈ గ్రామంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అప్పటి నుండి గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా ఆడపిల్ల పుట్టగానే గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగు రంగుల దీపాలను అలంకరించి సంబరం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అంతే కాకుండా పుట్టిన ఆడపిల్ల పై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మొదటి నెల వెయ్యి రూపాయలను గ్రామ పంచాయతీ తరపున జమ చేసి ఆ ఆడపిల్ల బంగారు భవితకు పునాదులు వేస్తున్నారు. హరిదాస్ పూర్ గ్రామస్థుల ఆదర్శ ఆచారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ప్రముఖులు గ్రామస్థుల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని గ్రామాలు తాము సైతం ఇదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సమాయత్త మవుతున్నాయి..
ఇప్పుడు ఈ గ్రామంలో మగవారితో సమానంగా ఆడపిల్లలు ఉన్నట్లుగా ఇటీవల జరిపిన లెక్కల్లో తెలీంది. అంతేకాకుండా.. ఊరంత ఏకమై.. తమ గ్రామాన్ని అందంగా మార్చుకున్నారు. ఆడపిల్ల భారమని.. శాపమని భావిస్తున్న ఇతర గ్రామాలకు ఇప్పుడు హరిదాస్ పూర్ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో అకౌంట్ ఓపెన్ చేసి పుట్టిన బిడ్డ పేరు మీద ఆరు నెలల ఆర్థిక సాయం జమచేస్తూ.. ఆ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరి మధ్యే అసలైన పోరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..