Nagarjuna : మన్మధుడి సినిమా అంటే మాములుగా ఉండదు మరి.. ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌తో…

కింగ్ నాగార్జున అటు సినిమాలతో ఇటు టీవీషోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలను లైన్‌లో పెడుతూనే మరో వైపు బిగ్ బాస్ బాధ్యతలను మోస్తున్నారు కింగ్.

Nagarjuna : మన్మధుడి సినిమా అంటే మాములుగా ఉండదు మరి.. ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌తో...
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 4:57 PM

Bangarraju: కింగ్ నాగార్జున అటు సినిమాలతో ఇటు టీవీషోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలను లైన్‌లో పెడుతూనే మరో వైపు బిగ్ బాస్ బాధ్యతలను మోస్తున్నారు కింగ్. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ నడిపించిన నాగ్.. ఇప్పుడు మూడో సీజన్‌కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక నాగ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుంది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు కూడా కళ్యాణ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయాలనీ నాగ్ చూస్తున్నారు. అనుకోని అవాంతరాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈసినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. తండ్రి కొడుకులుగా కనిపించారు నాగ్. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో గెస్ట్‌లుగా అనుష్క, అనసూయ వంటి హీరోయిన్స్ కనిపించరు. అలాగే బంగార్రాజు సినిమాలో కూడా పలువురు హీరోయిన్స్ కనిపించనున్నారట..  బంగార్రాజు భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా స్వర్గం నుండి వచ్చిన రంభ ఊర్వసి మేనకలు ఆయన వెంట ఉంటారట. ఇందుకోసం ముగ్గురు ముద్దుగుమ్మలను ఎంపిక చేశారట.. వీరిలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ కూడా ఉంటుందని టాక్. అలాగే నాగచైతన్యకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి నటిస్తుంది. ఇలా మొత్తం ఈ సినిమా ఐదుగురు అందగత్తెలు నటిస్తున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర