Bimla Nayak: భీమ్లా నాయక్ గ్లిమ్స్ కు రికార్డు వ్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా మారారు. ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యే కళ్యాణ్ లుక్ కు సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా మారారు. ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యే కళ్యాణ్ లుక్ కు సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ కు ఆల్ ఇండియా రికార్డు దక్కింది. మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న గ్లిమ్స్ గా భీమ్లా నాయక్ వీడియో నిలిచింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్‌స్టార్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదలై ఎంతగానో అలరిస్తోంది.
మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్.. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రను రానా పోషిస్తున్నారు. ఈ సినిమాకు రచన సహకారం త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో పాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లుకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. భవదీయుడు భగత్ సింగ్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. Republic Pre-Release Event LIVE | Pawan Kalyan | Sai Dharam Tej
Rajasthan politics: రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ సమావేశం.. నాయకత్వ మార్పుకేనా?