MLA Roja: నగరిలో చెల్లని ఎమ్మెల్యే రోజా మాట.. ఇలా తిరగబడ్డారేంటి..?

చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరు మరో సారి బయటపడింది. ఎమ్మెల్యే రోజా వర్సెస్‌ రెడ్డివారి భాస్కర్‌రెడ్డి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. నిండ్ర ఎంపీపీ ఎన్నికలో ...

MLA Roja: నగరిలో చెల్లని ఎమ్మెల్యే రోజా మాట.. ఇలా తిరగబడ్డారేంటి..?
Mla Roja
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Sep 25, 2021 | 10:40 PM

చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరు మరో సారి బయటపడింది. ఎమ్మెల్యే రోజా వర్సెస్‌ రెడ్డివారి భాస్కర్‌రెడ్డి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. నిండ్ర ఎంపీపీ ఎన్నికలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎంపీపీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి వాయిదా పడింది. నిండ్ర ఎంపీపీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు 8 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. అయితే రోజా ప్రతిపాదించిన ఎంపీపీ అభ్యర్థికి ముగ్గురు సభ్యులు మద్దతు తెలుపగా, వైసీపీకి చెందిన మరో నేత రెడ్డివారి భాస్కర్‌రెడ్డికి ఐదుగురు సభ్యులు మద్దతు తెలిపారు. రెడ్డివారి భాస్కర్‌రెడ్డి విప్‌ను ధిక్కరించారు. దీంతో ఎమ్మెల్యే రోజా, భాస్కర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తాను సూచించిన అభ్యర్థినే ఎన్నుకోవాలని రోజా పట్టుబట్టగా, దానికి భాస్కర్‌రెడ్డి అంగీకరించలేదు. అంతేకాదు చేతనైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని సవాల్‌ విసిరారు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి. దీంతో నిండ్ర ఎంపీపీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది.

నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న ఒక నేత ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల విషయంలోనూ ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ – పంచాయితీ ఎన్నికల్లో రోజా నియోజకవర్గం నగరిలో పార్టీ అన్ని చోట్లా విజయకేతనం ఎగరవేసింది. ఇక, నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలంలో ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు రోజాకు సవాల్ గా మారింది. అత్యధిక ఎంపీపీలు వైసీపీ గెలుచుకున్నా ఎమ్మెల్యే మాటకు భిన్నంగా మరొకరు మండల పదవి దక్కించుకొనే ప్రయత్నం సాగుతోంది. దీనికి రోజా వ్యతిరేక శిబిరంలోని నేతలు మద్దతిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. రోజా ఫిర్యాదు చేసినా ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి పైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు..దీని వెనుక ఎవరున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు.. చివర్లో మాములు ట్విస్ట్ కాదు

త్వరలో ఏపీ కేబినెట్‌లో మార్పులు.. వంద శాతం కొత్తవారే