Pawan Kalyan – Republic Movie: మోహన్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. మీకు కూడా ఆ పరిస్థితి రావొచ్చంటూ..
Pawan Kalyan - Republic Movie: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ట్యాగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకు అని అన్నారు.
Pawan Kalyan – Republic Movie: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ట్యాగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకు అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. చిత్ర పరిశ్రమలోని ఇబ్బందులు, ప్రభుత్వాల విధానాలు సహా అనే అంశాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన మోహన్ బాబు పైనా పలు కీలక కామెంట్స్ చేశారు.
ముందుగా పవర్ స్టార్ ట్యాగ్‌పై పవన్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని అవుతానా? లేదా? అనేది కాదు గానీ.. పోరాటం చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం అని పేర్కొన్నారు. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకు? అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ విధానాలను తూర్పరబట్టారు. తనపై ఉన్న కోపాన్ని.. చిత్ర పరిశ్రమపై చూపొద్దన్నారు. తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి.. ఆంధ్రాలో థియేటర్లు ఎందుకు లేవు? అని ఏపీ సర్కార్‌ను సూటిగా ప్రశ్నించారు. ‘‘మేం సినిమా తీస్తే.. టిక్కెట్లు మీరు అమ్ముతారా?. ఇదేం విధానం.’’ అంటూ ఫైర్ అయ్యారు. ప్రతీసారి సినిమా వాళ్ల జోలికి రావొద్దని, తెగేదాకా లాగొద్దని హితవుచెప్పారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు సినిమా ఇండస్ట్రీ వైపు చూడొద్దని, చిత్రపరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమలో పెట్టుకుంటే కాలిపోతారు అని అన్నారు. ఇది వైసీపీ రిపబ్లిక్ కాదని, ఇండియన్ రిపబ్లిక్ అని అన్నారు. థియేటర్ల ఓపెనింగ్ విషయంలో నానీని తిడుతుంటే బాధ కలిగిందన్నారు. థియేటర్లలో సినిమా రిలీజ్ కాకపోతే నాని ఏం చేస్తారని అన్నారు. కోపముంటే తన సినిమాలు ఆపండన్న పవన్.. తన వాళ్లను మాత్రం వదిలెయ్యండని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. లక్ష మంది సినిమా కార్మికుల పొట్ట గొట్టొద్దని హితవుచెప్పారు.
ఇక మోహన్ బాబు పైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చిత్రపరిశ్రమ పట్ల జరుగుతున్న అంశాలపై మోహన్ బాబు స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. ఏపీలో థియేటర్లు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడాలని అన్నారు. పవన్ కామెంట్స్ ఆయన మాటల్లోనే.. ‘‘వైఎస్ఆర్ కుటుంబీకులు మీ బంధువులు కదా.. చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్‌ను బ్యాన్ చేసుకోండి. అతను, మీరూ తేల్చుకోండి. కానీ చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు చెప్పండి. మీరు మాజీ ఎంపీ కూడా. ఈ అంశంపై మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే.. ఇవాళ చిత్రపరిశ్రమకు అమలు చేసిన చేసిన రూల్స్.. రేపటి రోజున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయొచ్చు. నా వరకు రాలేదు కదా? అని గమ్మునుండటం సరికాదు. ఈ చర్యలు రేపటి రోజున అది మీకు కూడా సమస్యగా పరిణమించొచ్చు. అప్పుడు మీరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని గుర్తెరిగి స్పందించండి.’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్.
Also read:
Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..