AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand Malineni: ఆ ఇద్దరు మిక్స్ అయితే తేజ్.. సాయిపై ప్రశంసలు కురిపించిన ఆ డైరెక్టర్ గోపిచంద్ మలినేని…

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం రిపబ్లిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం

Gopichand Malineni: ఆ ఇద్దరు మిక్స్ అయితే తేజ్.. సాయిపై ప్రశంసలు కురిపించిన ఆ డైరెక్టర్ గోపిచంద్ మలినేని...
Gopichand Malineni
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2021 | 7:48 AM

Share

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం రిపబ్లిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. డైరెక్టర్ దేవా కట్ట తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన ట్రైలర్‏కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‏ను నిన్న (సెప్టెంబర్ 25న) సాయంత్రం హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అంతేకాకుండా.. ఈ వేడకకు పలువురు సినీ ప్రముఖులు సైతం వచ్చారు. అలాగే ఈవేడుకకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి.. సాయి పై ప్రశంసలు కురిపించారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు సాయి ధరమ్ తేజ్. మా ఇద్దరికి ఓ ఎమోషనల్ బాండ్ ఉంది. సాయి నాకు తమ్ముడులాంటి వాడు. ప్రేమగా అన్నయ్య అంటూ పిలుస్తాడు. ఇండస్ట్రీలో ఓ మంచి మనిషి. అలాగే సినీ పరిశ్రమలో అజాతశత్రువు వంటి వాడు. ఆయన ఎంతో ఒదిగి ఉంటాడు. అక్టోబర్ 1న రిపబ్లిక్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 15న సాయి బర్త్ డే. ఈమూవీ పెద్ద హిట్ చేసి తేజ్ పుట్టిన రోజు కానుకగా ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే. తేజ్.. నిజంగానే ఓ ఫైటర్.. అతనితో పనిచేసినప్పుడు నేను కొన్ని గమనించాను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మిక్స్ అయితే తేజు గారు. ఆ స్టైల్ గానీ, డ్యాన్స్ గానీ.. వ్యక్తిత్వం గానీ.. ఆ ఇద్దరి నుంచి పుణికి పుచ్చుకున్నాడు. రిపబ్లిక్ గురించి మాట్లాడాలంటే ముందుగా దేవా కట్టా గురించి చెప్పాలి. ఆయనకంటూ ఓ యూనిక్ ఉంది. ట్రైలర్ బాగుంది. అందులో డైలాగ్స్ ఎంతో ఇంటెన్స్ గా ఉన్నాయి. సినిమా కూడా అలాగే ఉంటుందనుకుంటున్నాను. ఇక రమ్యకృష్ణ పాత్ర చాలా ముఖ్యమైందని.. బలమైందని తెలుస్తోంది. హీరోయిన్ ఐశ్వర్య తనెంటో ముందే నిరూపించుకుంది.. మన తెలుగమ్మాయి. ఇక రిపబ్లిక్ సినిమాను హిట్ చేయాలి. తేజ్ ఓ ఫైటర్.. విన్నర్.. అందరూ కలిసి సినిమాను సూపర్ హిట్ చేయాలని చెప్పుకొచ్చారు గోపిచంద్.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ఈసారి కూడా మ‌హిళా కంటెస్టెంట్‌నే బ‌య‌ట‌కు పంపించ‌నున్నాడా.? ఏం

జ‌ర‌గ‌నుంది.?

Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..