Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ఈసారి కూడా మ‌హిళా కంటెస్టెంట్‌నే బ‌య‌ట‌కు పంపించ‌నున్నాడా.? ఏం జ‌ర‌గ‌నుంది.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో 5వ సీజ‌న్ విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు కంటెస్టెంట్‌లు హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా తాజాగా మ‌రో హౌజ్‌మేట్‌ను ఇంటి నుంచి...

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ఈసారి కూడా మ‌హిళా కంటెస్టెంట్‌నే బ‌య‌ట‌కు పంపించ‌నున్నాడా.? ఏం జ‌ర‌గ‌నుంది.?
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Sep 26, 2021 | 6:56 AM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో 5వ సీజ‌న్ విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు కంటెస్టెంట్‌లు హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా తాజాగా మ‌రో హౌజ్‌మేట్‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ వారం శ్రీరామ చంద్ర‌, మాన‌స్‌, ప్రియ‌, ప్రియాంక‌, ల‌హ‌రి నామినేష‌న్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక‌, శ్రీరామ్ ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఇంకా ఎలిమినేష‌న్‌లో మాన‌స్‌, ప్రియా, ల‌హ‌రిలు నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయేది ఎవ‌రో తెలియాలంటే ఈ రోజు ప్ర‌సార‌మ‌య్యే బిగ్ బాస్ ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

ఎలిమినేట్ అయ్యేది ఆమేనా.?

ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో ఉన్న మాన‌స్‌, ప్రియా, ల‌హ‌రిలో ఎవ‌రు ఇంటి నుంచి వెళ్లి పోనున్నార‌న్న‌దానిపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో కాదు ల‌హ‌రి అని చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇటీవ‌ల ర‌వి, ప్రియా, ల‌హ‌రిల మ‌ధ్య జ‌రిగిన వ్య‌వ‌హార‌మే ల‌హ‌రి ఎలిమినేష‌న్‌కు కార‌ణ‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాంటే ఈ రోజు రాత్రి వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన ఇద్ద‌రు కూడా మ‌హిళా కంటెస్టెంట్‌లు కావ‌డం, ఇప్పుడు మూడో వారం కూడా మ‌హిళా హౌజ్‌మేట్ పేరు వినిపిస్తుండ‌డం గ‌మనార్హం.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‍బాస్ సీజన్ 5 పై నెటిజన్స్ పెదవివిరుపు.. ఇంటిసభ్యుల తీరుపై అసహనం.. కారణమేంటంటే..

Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరి మధ్యే అసలైన పోరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

Bigg Boss 5 Telugu: ఫాంలోకి వచ్చిన బిగ్‏బాస్.. రవి బండారం బట్టబయలు.. ఆ వీడియోతో లహరికి షాకిచ్చాడుగా !!