AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా ఇది.. ఈ నోటి దూలేంట్రా.. వాళ్లిద్దరిని ఏడిపిస్తున్నావ్.. షణ్ముఖ్‏ను ఓ ఆటాడుకున్న నాగ్..

అనుకున్నట్టుగానే.. శనివారం ఎపిసోడ్‏లో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఒక్క వీడియోతో లహరి కళ్లు తెరిపించాడు. అంతేకాకుండా

Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా ఇది.. ఈ నోటి దూలేంట్రా.. వాళ్లిద్దరిని ఏడిపిస్తున్నావ్.. షణ్ముఖ్‏ను ఓ ఆటాడుకున్న నాగ్..
Shanmukh
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2021 | 7:21 AM

Share

అనుకున్నట్టుగానే.. శనివారం ఎపిసోడ్‏లో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఒక్క వీడియోతో లహరి కళ్లు తెరిపించాడు. అంతేకాకుండా.. ఇంట్లో సభ్యులందరి ముందే రవి నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు. లహరితోనే అసలు విషయాన్ని రివీల్ ఇంట్లో సభ్యుల సందేహాలను కూడా క్లియర్ చేశాడు. మొత్తానికి నిన్నటి (సెప్టెంబర్ 25)న ఏం జరిగిందో తెలుసుకుందామా.

పుల్ ఫైర్‏తో ఎన్టీఆర్ రావణా పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఆ తర్వాత.. ఇంట్లో ఉన్న సభ్యులతోపాటు.. ప్రేక్షకుల సందేహాలను క్లియర్ చేయబోతున్నట్లుగా తెలిపాడు. ముందుగా రవి.. ప్రియ నేమ్ ప్లేట్ పగలకొట్టి.. విషయం ఏంటని ప్రశ్నించాడు… దీంతో రవి.. మాట్లాడుతూ.. లహరిని.. తనను.. తప్పుగా అర్థం చేసుకుందని.. తప్పంతా ప్రియదే అని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత లహరిని పవర్ రూంకు పంపించి.. రవి.. ప్రియ మాట్లాడుకున్న వీడియో చూపించి అసలు విషయాన్ని లహరికి తెలిసేలా చేశాడు. దీంతో బయటకు వచ్చిన లహరి.. తన వెనకాల మాట్లాడిన మాట్లాడిన చెబుతూ… అందరి ముందే రవి కడిగిపారేసింది. ఇక ఆ తర్వాత ప్రియను హగ్ చేసుకుని తన తప్పు లేదని చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత ఒక్కొక్కరికి చేసిన తప్పులను చెబుతూ.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ వచ్చాడు నాగ్. ఆ తర్వాత షణ్ముఖ్‏ను ఓ ఆట ఆడుకున్నాడు. టాస్క్‏లో శ్వేతను.. ఫ్రెండ్ షిప్ కట్ చేసి సిరిని ఏడిపించిన షణ్ముఖ్‏కు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఏంట్రా ? ఈ నోటి దూలేంట్రా ? అటు అటు శ్వేతను, ఇటు సిరిని ఏడిపిస్తున్నావు? అని కౌంటరేశాడు. ఇక గుంటనక్క ఎవరని నాగ్‌ నటరాజ్‌ మాస్టర్‌ను నిలదీయగా నెక్స్ట్‌ టైమ్‌ చెప్తానని దాటవేశాడు. తర్వాత శ్రీరామ్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. మొత్తానికి మరోసారి షణ్ముఖ్‏ను తనస్టైల్లో ఆడుకున్నాడు నాగ్.

Also Read: Mahesh Babu: అస‌లు సాయిప‌ల్ల‌వికి ఎముక‌లు ఉన్నాయా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్ బాబు.

Bigg Boss 5 Telugu: వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. రవికి ఇచ్చిపడేసాడుగా..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ఈసారి కూడా మ‌హిళా కంటెస్టెంట్‌నే బ‌య‌ట‌కు పంపించ‌నున్నాడా.? ఏం జ‌ర‌గ‌నుంది.?