Visakhapatnam: పెట్టుబడులే లక్ష్యంగా.. విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. మంత్రి అమర్నాథ్
ఈసమ్మిట్ కు ముందు పలు దేశాల్లో రోడ్ షోలు నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తాం. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఏపీలోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు' అని మంత్రి పేర్కొన్నారు.

వచ్చే ఏడాది విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మార్చి 3,4 తేదీల్లో నిర్వహించే ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ‘గత మూడేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమ్మిట్ నిర్వహించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేలా ఈ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించనున్నాం. అలాగే ఈ సమ్మిట్ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. సమ్మిట్ కు ముందు పలు దేశాల్లో రోడ్ షోలు నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తాం. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఏపీ లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు’ అని మంత్రి పేర్కొన్నారు.
పీఎంవో సమ్మతితో..
కాగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా అగ్రి, మెరైన్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం,హెల్త్ కేర్ రంగాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే భావనపాడు, మచిలీపట్నం పోర్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. జనవరి 2024 నాటికి రామాయపట్నం పోర్టుకు మొదటి ఓడను తీసుకోస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు ఇక ప్రధాని మోడీ విశాఖ పర్యటనపై మాట్లాడుతూ ‘ 11 న రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన పై పీఎంవోకి లేఖ రాశాం. ప్రధాని కార్యాలయం అంగీకరిస్తే అదే రోజు శంకుస్థాపన ఉంటుంది’ అని అమర్నాత్ తెలిపారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..