Organ Donation: నీది గొప్ప జన్మ తల్లి.. నలుగురికి పునర్జన్మ ప్రసాదించిన మహిళ మృతదేహంపై పూలవర్షం

శ్రీకాకుళం జిల్లా మధుపం కు చెందిన 30 ఏళ్ల పట్నాన చంద్రకళ... బ్లడ్ హేమరేజ్ సమస్యతో విశాఖ విమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.

Organ Donation: నీది గొప్ప జన్మ తల్లి.. నలుగురికి పునర్జన్మ ప్రసాదించిన మహిళ మృతదేహంపై పూలవర్షం
Organ Donation
Follow us

|

Updated on: Jun 02, 2023 | 12:30 PM

ఆమెది ఓ సాధారణ కుటుంబం. భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇదే సమయంలో ఆ కుటుంబంలో తీరని విషాదం. భార్య బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం ఆవశ్యకతను విమ్స్ వైద్యులు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబం.. కొండంత ఔదార్యంతో అవయవ దానానికి ముందుకు వచ్చింది. ఆమె తమ కళ్ళ ముందు లేకున్నా.. నలుగురులో జీవిస్తుందని గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో ఆమె మృతదేహానికి వీర వనితల పూలవర్షంతో బంధువులకు అప్పగించారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. శ్రీకాకుళం జిల్లా మధుపం కు చెందిన 30 ఏళ్ల పట్నాన చంద్రకళ… బ్లడ్ హేమరేజ్ సమస్యతో విశాఖ విమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. బ్రెయిన్ డెడ్ గా గుర్తించిన వైద్యులు విషయాన్ని బంధువులకు చెప్పారు. ఇదే సమయంలో జీవనధాన్ ప్రాముఖ్యతను వివరించారు. పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ చేయడం కాస్త కష్టమే అయినప్పటికీ.. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆమె కుటుంబంతో మాట్లాడారు. జీవన దాన్ తో అవయవాల దానం చేయడం ద్వారా.. మరొకరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు అన్న విషయాన్ని ఆ కుటుంబానికి చెప్పారు.

పుట్టడు దుఃఖంలోనూ ఆ కుటుంబం పెద్ద మనసుతో ముందుకు వచ్చింది. చంద్రకళ మృతదేహం నుంచి అవయవ దానం కోసం అంగీకరించింది ఆ కుటుంబం. దీంతో తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చంద్రకళ మృతదేహం నుంచి రెండు కిడ్నీలు, కార్నియాలను సేకరించారు. అంతేకాదు.. అవయవ దానం చేసిన మహిళకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. వీర వనితల పూల వర్షంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి బృందం. చంద్రకళ మృతదేహానికి ఆసుపత్రిలో ప్రత్యేక నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేసారు విమ్స్ డైరెక్టర్ రాంబాబు.

ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా…

– ఏపీలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానం జరిగింది. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే అవయవాల తో 8 మందికి జీవితం ప్రసాదించవచ్చని అంటున్నారు విమ్స్ డైరెక్టర్. అవయవ దానం పై అవగాహన పెరగాలి.. అపోహలు, మూఢనమ్మకాలు మానాలని కోరుతున్నారు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు

ఇవి కూడా చదవండి

– నిజంగా మరణించి బతుకుతున్న ఆ మహిళకు సలాం చేయాలి. అలాగే పుట్టడు దుఃఖంలోనూ నలుగురి జీవితాల్లో వెలుగులో నింపేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆ కుటుంబానికి సెల్యూట్ చేయాల్సిందే.

-ఖాజా, విశాఖపట్నం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..