Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏపీ పోలీసుల షాక్.. ఏం జరిగిదంటే..!
పోలీసుల నిర్ణయం నేపథ్యంలో.. నిర్వాహకులు ఈ లైవ్ కాన్సెప్ట్ ను మరో తేదీకి రీ షెడ్యూల్ చేయాలని.. లేకపోతే వెన్యూ మార్చాలా అన్న అంశం ఆలోచించినప్పటికీ.. భారీగా టికెట్లు సేలవడం.. మళ్లీ ఏర్పాట్లు కోవడం అంత ఈజీ కాదని భావించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు చెప్పిన కండిషన్స్ కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం వైజాగ్ డిఎస్పి లైవ్ కాన్సెర్ట్ ప్రోగ్రాం అనుమతి నిరాకరణ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

‘ నే వస్తున్నా.. వైజాగూ.. నా బుజ్జి ఫ్యాన్స్యూ..! హలో వైజాగ్ దిస్ ఈజ్ డీఎస్పీ మీ సిటీకి వస్తున్నా.. డి.ఎస్.పి ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూర్ ల తర్వాత పర్ఫార్మెన్స్ చేసేందుకు వైజాగ్ వస్తున్నా..లెట్స్ డాన్స్.. సింగ్.. పార్టీ.. టికెట్లు బుక్ చేసుకోండి..’ అంటూ జోష్ తో ప్రకటన ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కు విశాఖ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈనెల 19న నిర్వహించాల్సిన లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ కు అనుమతి నిరాకరించారు. భద్రత కారణాల దృష్యా అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఈ లైవ్ కాన్సెర్ట్ కు ఏర్పాట్లు చేసుకున్నారు ఏ సి టి సి ఈవెంట్స్.
విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో.. డిఎస్పి ఈవెంట్ నిర్వహణ కోసం పర్మిషన్ పెట్టుకున్నారు నిర్వాహకులు. ఈనెల ఏడో తేదీని పోలీసులకు లెటర్ అందించారు. పోలీసులు ఆ లెటర్ ను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ అవుతున్న సమయంలోనే.. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఆక్వా వరల్డ్ లో.. రిషి అనే ఆరేళ్ల బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో భద్రత ఎంత అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. డి.ఎస్.పి ఈవెంట్ జరిగే స్టేడియం ప్లేస్ కు, బాలుడు దుర్ఘటన జరిగిన వేవ్ పూల్ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఒకే పోర్ట్ స్టేడియం ప్రాంగణంలోనే వివిధ ఫన్ గేమ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్నో వరల్డ్ తో పాటు.. ఆ పక్కనే ప్రత్యేకంగా స్టేడియం మైదానం కూడా ఉంది. మిగతా వాటితో ఈ మైదానానికి సంబంధం లేకపోయినప్పటికీ.. ప్రధాన మార్గం మాత్రం ఒక్కటే. దాదాపు పదివేల మంది వరకు హాజరయ్యే డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్ కు అనుమతిపై పలుమార్లు స్టేడియం విజిట్ చేశారు పోలీసులు, జీవీఎంసీ అధికారులు. స్టేడియంలోకి వెళ్లేందుకు మార్గాలతో పాటు.. భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పలు అంశాలపై దృష్టి సారించారు అధికారులు. ప్రస్తుతం స్టేడియంలో ఉన్న వసతులతో అనుమతి ఇచ్చేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు అక్కడ లేకపోవడంతో… పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించారు పోలీసులు. దీంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు నిర్వాహకులకు రిప్లై ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నేపథ్యంలో భద్రతా కారణాల దృష్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని నిర్వాహకులకు చెప్పినట్టు తెలిపారు ఫోర్త్ టౌన్ సిఐ సత్యనారాయణ.
కండిషన్స్ తో సూచన..
అయితే నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవడంతో.. మరోసారి పరిశీలించాలని పోలీసులను కోరారు. అందుకు పోలీసులు కొన్ని కండిషన్స్ పెట్టారు. కార్యక్రమానికి హాజరయ్యే పబ్లిక్ ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ తో పాటు.. వాహనాల పార్కింగ్.. ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాలు, అంబులెన్స్ లాంటి సదుపాయాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు పోలీసులు. దీంతో పోలీసులు చెప్పిన సూచనలను ఫుల్ ఫీల్ చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ‘ మేము చెప్పిన కండిషన్స్ కు అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటే.. పర్మిషన్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తాం..’ అని టీవీ9తో అన్నారు ఈస్ట్ ఏసిపి లక్ష్మణ మూర్తి.
అయితే.. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేసుకున్నారు. ఆన్లైన్లోనూ భారీగా టికెట్లు సేల్ అయ్యాయి. పర్మిషన్ వస్తుందని ఆశతో ఎదురు చూశారు నిర్వాహకులు. మరో మూడు రోజుల్లో ఈవెంట్ అనగా.. పోలీసుల తీసుకున్న నిర్ణయం నిర్వాహకులకు షాక్ కు గురి చేసింది. అనుమతి నిరాకరించడంతోపాటు అటు డి.ఎస్.పి, నిర్వాహకులతో పాటు.. ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. పోలీసుల నిర్ణయం నేపథ్యంలో.. నిర్వాహకులు ఈ లైవ్ కాన్సెప్ట్ ను మరో తేదీకి రీ షెడ్యూల్ చేయాలని.. లేకపోతే వెన్యూ మార్చాలా అన్న అంశం ఆలోచించినప్పటికీ.. భారీగా టికెట్లు సేలవడం.. మళ్లీ ఏర్పాట్లు కోవడం అంత ఈజీ కాదని భావించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు చెప్పిన కండిషన్స్ కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం వైజాగ్ డిఎస్పి లైవ్ కాన్సెర్ట్ ప్రోగ్రాం అనుమతి నిరాకరణ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..