బ్యాంక్ లో చేయికోసుకున్న ఓ వ్యక్తి

ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపేందర్ అనే యువకుడు ఎస్బీఐ బ్యాంకు ఎదుట చేయి కోసుకున్నాడు. లోన్ మంజూరైనా బ్యాంకు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఉపేందర్ ఈ పనికి పూనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తనకు లోన్ మంజూరైందని.. బ్యాంకు సిబ్బంది డబ్బుల గురించి అడిగితే.. తిప్పించుకుంటున్నారని అంటున్నాడు ఉపేందర్. బ్యాంకు సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఉపేందర్ చేయి కోసుకున్నాడు. బ్యాంకు దగ్గరే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:45 am, Tue, 19 February 19
బ్యాంక్ లో చేయికోసుకున్న ఓ వ్యక్తి

ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపేందర్ అనే యువకుడు ఎస్బీఐ బ్యాంకు ఎదుట చేయి కోసుకున్నాడు. లోన్ మంజూరైనా బ్యాంకు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఉపేందర్ ఈ పనికి పూనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తనకు లోన్ మంజూరైందని.. బ్యాంకు సిబ్బంది డబ్బుల గురించి అడిగితే.. తిప్పించుకుంటున్నారని అంటున్నాడు ఉపేందర్. బ్యాంకు సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఉపేందర్ చేయి కోసుకున్నాడు. బ్యాంకు దగ్గరే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపేందర్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా.. క్షణికావేశంలో ఇలా చేసుకున్నాడని చెప్పారు. ఉపేందర్ చేయి కోసుకోవడం చూసిన బ్యాంక్ మేనేజర్ స్పృహ తప్పి పడిపోయాడు.