Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 4 గంటలు ఆలస్యం కానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
వందేభారత్ రైలు మరోసారి ఆలస్య కానుంది. ఇప్పటికే ఈ మధ్య కాలంలో విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం కూడా వందేభారత్ ఆలస్యంకానుంది. రన్నింగ్ పెయిర్ ట్రైన్ ఆలస్యం కావడంతో విశాఖ నుంచి పలు రైళ్ల ఆలస్యం కానున్నాయి...

వందేభారత్ రైలు మరోసారి ఆలస్య కానుంది. ఇప్పటికే ఈ మధ్య కాలంలో విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం కూడా వందేభారత్ ఆలస్యంకానుంది. రన్నింగ్ పెయిర్ ట్రైన్ ఆలస్యం కావడంతో విశాఖ నుంచి పలు రైళ్ల ఆలస్యం కానున్నాయి.
సాధారణంగా తెల్లవారు జామున 05:45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ – విశాఖపట్నం – సికింద్రాబాద్(20833) ఎక్స్‌ప్రెస్ ఏకంగా 4.45 గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో వందేభారత్ విశాఖ నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక వందేభారత్‌తో పాటు మరికొన్ని రైళ్లు ఆలస్యం కానున్నాయి. 112842 ఎం జీ అర్- చెన్నై సెంట్రల్-షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యం కానుంది. ఈ రైలు 07.00 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 10.30 గంటలకు బయలుదేరనుంది. దీంతో పాటు 12829 ఎం జీ అర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం కానుంది.




*Important Train related Information:* *RE-SCHEDULING OF TRAINS* @RailMinIndia @EastCoastRail @SCRailwayIndia @GMSRailway @DrmChennai @drmvijayawada @DRMKhurdaRoad @drmkgp @serailwaykol @DRMSambalpur @drmsecunderabad pic.twitter.com/wqUcq2STCg
— DRMWALTAIR (@DRMWaltairECoR) June 16, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..