Chandra Babu: ‘ఎంపీ కుటుంబానికే దిక్కులేదు, సామన్యుడికి భద్రత ఉందా?’.. కుప్పంలో బాబు హాట్ కామెంట్స్..
AP Politics: చంద్రబాబు కుప్పం టూర్ బిజిబిజీగా సాగింది. పార్టీలో చేరికలు, క్యాడర్‌తో వరుస భేటీలతో నూతనోత్సాహం కనిపించింది. 2024 ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసిన చంద్రబాబు.. టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. కుప్పంలో లక్ష ఓట్ల మోజార్టీ క్యాంపెయిన్‌పై స్థానిక నేతలకు..

AP Politics: చంద్రబాబు కుప్పం టూర్ బిజిబిజీగా సాగింది. పార్టీలో చేరికలు, క్యాడర్‌తో వరుస భేటీలతో నూతనోత్సాహం కనిపించింది. 2024 ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసిన చంద్రబాబు.. టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. కుప్పంలో లక్ష ఓట్ల మోజార్టీ క్యాంపెయిన్‌పై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి ఎమ్మెల్యేగా విజ్ఞప్తులను స్వీకరించి.. కుప్పం ఎమ్మెల్యేగా ఉండడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు చంద్రబాబు. ఇంకా కుప్పం బహిరంగసభలో పాల్గొన్న పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు చంద్రబాబు. 2024లో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. లక్ష ఓట్లు మెజార్టీ తెప్పిస్తే నాయకులకు రుణపడి ఉంటానని చెప్పారు చంద్రబాబు.
దౌర్జన్యంతో కుప్పం మున్సిపాలిటీ గెలిస్తే తనను ఓడిస్తాం అనుకుంటున్నారని.. ఇలాంటి వాళ్లను తన 40ఏళ్ల రాజకీయల జీవితంలో ఎంతో మందిని చూశానన్నారు బాబు. అలాగే రాష్ట్రంలోను 175/ 175 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించాలి.. అదే తమ లక్ష్యమని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించిన బాబు.. ప్రజా ప్రతినిధులకు భద్రత లేదు.. విశాఖలో ఎంపీ భార్యాబిడ్డలను కిడ్నాప్ చేస్తే దిక్కులేదంటూ మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంతో.. ఎంపీ కుటుంబం కిడ్నాప్‌నకు గురైందన్నారు. ఎంపీ కుటుంబానికే భద్రత కరువైతే సామాన్యుడి పరిస్థితేంటని ప్రశ్నించారు చంద్రబాబు.
మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు కేసులు కట్టరు అదే మీ తల్లికి చెల్లికి జరితే ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు చంద్రబాబు. వివేకా బిడ్డ సునీత.. తన తండ్రి ఆత్మకు శాంతి కలిగించేందుకు పోరాటం చేస్తోంది. అందుకే వైఎస్ సునీతకు తాము సంఘీభావం తెలియచేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. నియోజకవర్గంలోని మండలాల ముఖ్య నేతలు, బూత్ లెవెల్ కమిటీలు, గ్రామస్థాయి నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు.. తొమ్మిది నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది.. కుప్పానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటానన్నారు. ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు చంద్రబాబు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..