Andhra Pradesh: ‘రంగు’లతో మస్కా కొట్టే జగత్జంత్రీగాడు.. సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిపడేసిన ఖాకీలు..

జిల్లాలు దాటి వస్తాడు.. అనుకున్న చోట ఆగి చేతికి పని చెబుతాడు. పక్కా స్కెచ్‌తో పని పూర్తయ్యాక రంగు మార్చేస్తాడు. ఆ టూ వీలర్ తోనే అన్నీ చేస్తాడు! ఒక్కడే వచ్చి అన్ని చుట్టేస్తాడు. కానీ, వాడి ఆటలు ఎక్కువ కాలం సాగనివ్వలేదు ఖాకీలు. అదును చూసి పట్టేశారు. చివరకు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. మరి రంగులు మార్చి.. పోలీసులను ఏమార్చి..

Andhra Pradesh: ‘రంగు’లతో మస్కా కొట్టే జగత్జంత్రీగాడు.. సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిపడేసిన ఖాకీలు..
Visakhapatnam Thief
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 16, 2023 | 6:29 PM

జిల్లాలు దాటి వస్తాడు.. అనుకున్న చోట ఆగి చేతికి పని చెబుతాడు. పక్కా స్కెచ్‌తో పని పూర్తయ్యాక రంగు మార్చేస్తాడు. ఆ టూ వీలర్ తోనే అన్నీ చేస్తాడు! ఒక్కడే వచ్చి అన్ని చుట్టేస్తాడు. కానీ, వాడి ఆటలు ఎక్కువ కాలం సాగనివ్వలేదు ఖాకీలు. అదును చూసి పట్టేశారు. చివరకు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. మరి రంగులు మార్చి.. పోలీసులను ఏమార్చి.. నేరాలు చేస్తున్న ఆ దొంగ ఎవడు? ఎందుకలా చేస్తున్నాడు?

విశాఖలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో కూపిలాగిన పోలీసులకు.. ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఒక కేసులో కూపి లాగితే.. నాలుగు నేరాల చిక్కుముడి వీడింది. నేరస్తుడు చిక్కాడు. అతని నుంచి 116 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేరానికి వినియోగించే టూ వీలర్ ను కూడా సీజ్ చేశారు. కానీ వాడి వ్యవహారం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.

ఇచ్చాపురం నుంచి వచ్చి..

పేరు దుక్క జయరాం. ఊరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం గ్రామం. ఆర్థిక సమస్యల కారణంగా నేరాలు చేయడం ప్రారంభించాడు. ఏకంగా నేరాలకు విశాఖను కేంద్రంగా చేసుకున్నాడు. ఇచ్చాపురం టు విశాఖ వచ్చి.. చేతికి పని చెప్పాడు. ఓ టూ వీలర్ ను చోరీ చేసి దానిపై నేరాలు చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

గతేడాది అక్టోబర్‌లో మురళి నగర్ రోడ్‌లో పద్మజ అనే మహిళ.. నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి టూ వీలర్‌పై వచ్చి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారం గొలుసు లాక్కెళ్ళాడు. ఈ ఏడాది మార్చి 23న ఆ ప్రాంతంలోనే మరో చైన్స్ స్నాచింగ్ జరిగింది. అమ్మాజీ అనే మహిళ మెడలోంచి ఆరు తులాల నల్లపూసల తాడును లాక్కెళ్లాడు. ఈ రెండు కూడా గాజువాకలో చోరీ చేసిన 2 వీలర్ పైనే చేశాడు. గాజువాకలో ఓ ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డాడు.

1800 సీసీ కెమెరాలు పరిశీలించారు..

మురళి నగర్ చైన్ స్నాచింగ్ కేసులో.. కూపి లాగుతుండగా పోలీసులకు ఆ దొంగ చిక్కినట్లే చిక్కి మిస్ అవుతున్నాడు. దీంతో ఆ కేటుగాడిని పట్టుకునేందుకు దాదాపుగా సిటీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ వెరిఫై చేశారు. పాత నేరస్తుల వివరాలను ఆరా తీశారు. కానీ ఎక్కడా క్లూ చిక్కలేదు. సిటీ పరిధిలో ఉన్న దాదాపుగా 1,800 సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. అనుమానం వచ్చినప్పటికీ… కేసు పురోగతి కనిపించలేదు. దీంతో బండి నెంబర్‌ను ట్రాక్ చేసి.. యజమానికి చూపించేసరికి బండి తనదేనని చెప్పాడు. అయితే, ఆ కలర్ తనది కాదని చెప్పాడు ఆ యజమాని. దీంతో దానిపై వర్కౌట్ చేశారు పోలీసులు.

రంగులు అందుకే మారుస్తాడు..

ఇచ్చాపురం నుంచి నేరాలు చేసేటప్పుడు విశాఖ వచ్చే జయరాం.. పోలీసులను ఏమార్చేందుకు సరికొత్త ప్లానే వేశాడు. స్ప్రే పెయింటింగ్‌లో అనుభవం ఉన్న జయరాం.. చోరీలు చేసిన ప్రతిసారి బండికి రంగు మార్చడం ప్రారంభించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు బండికి కలరింగ్ చేశాడు. అది కూడా ఎవరూ గుర్తుపట్టలేని రంగులనే ఎంచుకొని ఒరిజినల్ కలర్ అనుకునే స్థాయిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చేవాడు. అందుకే సీసీ కెమెరాలు ఎన్నిసార్లు చెక్ చేసినప్పటికీ పోలీసులు ఏమరపాటుకు గురవ్వాల్సి వచ్చింది.

ఒక్కోసారి బండి నెంబర్‌ని కూడా మార్చేసేవాడు జయరాం. ఓసారి బండి యజమానిని పిలిపించి సీసీ కెమెరాలు చూపించేసరికి గుర్తుపట్టాడు యజమాని. అయితే ఆ బండి కలర్ తనది కాదని పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీంతో దానిపై వర్కౌట్ చేసిన పోలీసులు. కూపి లాగితే లింకు ఇచ్చాపురానికి తగిలింది. ఎట్టకేలకు జయరాంను ట్రాక్ చేసిన పోలీసులు.. అతని నుంచి చోరీ సొత్తును, బైక్ ను సీజ్ చేశారు. నిందితుడు జయరాం ను క్రైమ్ డిసిపి నాగన్న ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఎట్టకేలకు రంగులు మార్చిన అసలు దొంగ పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుని తిరుగుతున్న జయరాంను పట్టుకోవడంతో సిబ్బందిని అభినందించారు ఉన్నతాధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ