AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: నారా లోకేష్ ఆరోపణలు.. టైమ్‌, డేట్, ప్లేస్ చెప్పాలంటూ ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్..

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం తారాస్థాయికి చేరింది. పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవిపై సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్. చర్లో కొత్తూరు గ్రామానికి చెందిన దళితుల భూములు ఎమ్మెల్యే.. ఆమె అనుచరులు కబ్జా చేశారంటూ ఆరోపించారు లోకేష్.

Nara Lokesh
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2023 | 7:16 PM

Share

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం తారాస్థాయికి చేరింది. పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవిపై సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్. చర్లో కొత్తూరు గ్రామానికి చెందిన దళితుల భూములు ఎమ్మెల్యే.. ఆమె అనుచరులు కబ్జా చేశారంటూ ఆరోపించారు లోకేష్.

నారా లోకేష్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే శ్రీదేవి. మహిళా ఎమ్మెల్యేపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల భూములు కబ్జాపై.. తనకు, తన అనుచరులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. లోకేష్ చేసిన ఆరోపణలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే శ్రీదేవి.

ఎమ్మెల్యే సవాల్ కు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. పేరేముల గ్రామంలోని సర్వే నెంబర్ 249, 250 సర్వే నెంబర్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని 1986లో గోపాల్ నాయక్ ఆనంద నాయక్ నుంచి 12 మంది దళితులు కొనుగోలు చేస్తే.. ఆ భూమిని 2020లో ఓబులాపురానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద వైసీపీ నేతలు దొంగ డాక్యుమెంట్లతో ఆన్లైన్ చేసుకున్న ఆధారాలను బయటపెట్టారు. అయితే, లోకేష్ దళితుల భూములు కబ్జాకు గురైనట్లు విడుదల చేసిన డాక్యుమెంట్స్ పై ఎమ్మెల్యే ఏవిధంగా రియాకర్ట్ అవుతారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?