AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒకరిద్దరు కాదు.. ఒకసారి 150 మందిపై కేసు నమోదు.. ఇంతకీ వారేం చేశారంటే..

ఒకరిద్దరిపై లేదా 10, 20 మందిపై కేసు నమోదు చేయటం చూస్తుంటాం.. కాని అక్కడ ఏకంగా 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటంటారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. వారం రోజుల నుండి వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి

Andhra Pradesh: ఒకరిద్దరు కాదు.. ఒకసారి 150 మందిపై కేసు నమోదు.. ఇంతకీ వారేం చేశారంటే..
Fir On Tdp Leaders
T Nagaraju
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 28, 2023 | 10:14 PM

Share

వినుకొండ, జులై 28: ఒకరిద్దరిపై లేదా 10, 20 మందిపై కేసు నమోదు చేయటం చూస్తుంటాం.. కాని అక్కడ ఏకంగా 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటంటారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. వారం రోజుల నుండి వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత జివిఎస్ ఆంజినేయులు వెళ్ళారు. వెళ్ళటమే కాకుండా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడున్నాడని ఆరోపించారు.

నా భూమిలోకి వెళ్ళి..

మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తన స్వంత భూమిలోకి, అదే విధంగా పక్కనే ఉన్న తన డెయిరీలోకి వెళ్ళి ప్రభుత్వ భూమి అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్రమంగా తన ప్రవేటు స్థలంలోకి వచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే జివిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వారిపై సెక్షన్ 447, 506 కింద కేసు నమోదు చేశారు.

అక్రమ కేసులంటూ…

అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునిచ్చారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో టిడిపి కార్యకర్తలు వాగ్వివాదానికి దిగటంతో ఇరు వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో.. గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకోవడం, రాళ్ళ దాడి చేసుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పదిహేను మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎమ్మెల్యే బొల్లా గన్ మెన్ నబి కూడా ఉన్నారు.

150 మందిపై కేసు నమోదు..

తనపై దాడి చేసిన టిడిపి కార్యకర్తలపై ఎమ్మెల్యే గన్ మెన్ నబి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టిడిపి నాయుకులు 1.జగ్గారావు, 2.pv సురేష్, 3.గడిపూడి విశ్వనాధం, 4. పఠాన్ అయిబ్ ఖాన్, 5. తూమాటి కాశీ, 6. నర్రా కిషోర్, 7.విరగంధం ప్రశాంత్, 8. మీసాల మురళీ కృష్ణ సహా 150 మంది కార్యకర్తల పై 147, 148, 341, 353, 332, 324 r/w 149 IPC సెక్షన్ లు కింద కేసులు నమోదు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన 150 మందిపై కేసు నమోదు చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..