AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: గత పదిరోజులుగా విద్యుత్ కోతలు.. ఉక్కబోత తక్కుకోలేకపోతున్నాం అంటూ అర్ధరాత్రి బాధితుల ఆందోళన..

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి సెంటర్లో అర్ధరాత్రి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు నాలుగు గ్రాములు ప్రజలు. తమ గ్రామాల్లో గత పది రోజులుగా కరెంట్ లేక అంధకారంలోనే ఉంటున్నామని.. దీనికి తోడు ఎండ వేడికి తట్టుకో లేకపోతున్నామని.. మరోవైపు ఉక్క పోతతో అలమటిస్తున్నామని నాలుగు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Konaseema: గత పదిరోజులుగా విద్యుత్ కోతలు.. ఉక్కబోత తక్కుకోలేకపోతున్నాం అంటూ అర్ధరాత్రి బాధితుల ఆందోళన..
Konaseema
Surya Kala
|

Updated on: Jun 17, 2023 | 9:00 AM

Share

వేసావి కాలం నుంచి వర్షాకాలంలో అడుగు పెట్టె సమయం వచ్చినా ఎక్కడా భానుడు తన ప్రతాపాన్ని తగ్గించడం లేదు. రోజు రోజుకీ భానుడు భగభగలతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు వీలైనంత వరకూ ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్డుమీదకు రావడం లేదు. ఓ వైపు వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న కోనసీమ వాసులను మరోవైపు కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరెంట్ కోతలతో ఉక్కపోతకు ఊపిరాడడం లేదంటూ జిల్లాలోని నాలుగు గ్రామ ప్రజలు అర్ధ రాత్రి రోడ్డు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే..

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి సెంటర్లో అర్ధరాత్రి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు నాలుగు గ్రాములు ప్రజలు. తమ గ్రామాల్లో గత పది రోజులుగా కరెంట్ లేక అంధకారంలోనే ఉంటున్నామని.. దీనికి తోడు ఎండ వేడికి తట్టుకో లేకపోతున్నామని.. మరోవైపు ఉక్క పోతతో అలమటిస్తున్నామని నాలుగు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము విద్యుత్ అధికారులకు ఎన్ని  సార్లు ఫోన్ చేసిమా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆరోపిస్తున్నారు. తమ బాధను తాము పడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నామని.. అందుకనే అర్ద రాత్రి రోడ్డు ఎక్కామని కరెంటు కోతలు బాధితుల చెబుతున్నారు.

విద్యుత్ ఆఫీస్ వద్ద అధికారులను కలిసిన బాధితులు.. గత 10 రోజులుగా విద్యుత్ సరిగా లేకపోవడంతో ఉక్కపోతతో అలమటిస్తున్నామని ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు తక్షణం విద్యుత్ సరఫరాను ఇవ్వాలంటూ ఎలక్రిక్ట్ అధికారులను మిలదీశారు నాలుగు గ్రామాల ప్రజలు. అంతేకాదు తమ గ్రామాలకు తక్షణం కరెంటు కోతలు లేకుండా చూడాలని లేని పక్షంలో ఆందోళనా తీవ్రతరం చేస్తామని ఎలక్ట్రికల్ అధికారులను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!