AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram Airport : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. శంషాబాద్‌ను తలదన్నేలా.. గన్నవరం ఎయిర్‌పోర్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గుడ్‌ న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతన నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు తుదిదశకు చేరాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ నిర్మాణం పూర్తయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో ఒకటిగా ఈ గన్నవర్ విమానశ్రయం అవతరించనుంది.

Gannavaram Airport : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. శంషాబాద్‌ను తలదన్నేలా.. గన్నవరం ఎయిర్‌పోర్ట్!
Gannavaram Airport New Terminal
M Sivakumar
| Edited By: Anand T|

Updated on: Nov 27, 2025 | 1:51 PM

Share

విజయవాడ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు తుదిదశకు చేరాయి. గ్లాస్, స్టీల్ స్ట్రక్చర్‌తో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం 80 శాతం పూర్తయింది, మిగిలిన 20 శాతం పనులు మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతర్గత పనులు, ముఖ్యంగా ఇంటీరియర్ పనులు, ఈ నాలుగు నెలల కాలంలో పూర్తి కావాల్సి ఉన్నాయి. టెర్మినల్ అభివృద్ధి చెందుతున్న సమయంలో, 40 కోట్లతో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టపర్, ఏబీసీ కాంప్లెక్సులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, కొత్త ఆఫ్రాన్ పనులు కూడా పూర్తి అయ్యాయి, ఇవి భారీ విమానాలను పార్కింగ్ చేయడానికి అనుకూలంగా తయారయ్యాయి. గ్రాండ్ ఎంట్రన్స్ పనులు 95 శాతం పూర్తయ్యాయి, ఇక్కడకు చేరుకోవడానికి శంషాబాద్ తరహా మినీ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేయబడింది, ఇదిది కూడా దాదాపు 90 శాతం పూర్తయింది.

విజయవాడ విమానాశ్రయ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అధికార కార్యాలయాలు, గెస్ట్ హౌస్, అరైవల్స్, డిపార్చర్స్, కస్టమ్స్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, కమర్షియల్ బ్లాకులు వంటి అనేక సదుపాయాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, సెంట్రలైజ్డ్ ఏసీ, పర్యావరణహిత విద్యుత్ వ్యవస్థలు, కన్వేయర్ బెల్ట్స్ వంటి ఆధునిక సదుపాయాలు టెర్మినల్‌లో ఏర్పాటు కానున్నాయి. వెయిటింగ్ ఏరియాలు, మూడు ఏరో బ్రిడ్జిల నిర్మాణం 90 శాతం పూర్తయ్యాయి, కాంక్రీట్ స్ట్రక్చర్ కూడా పూర్తి అయింది. వాటి మీదుగా ప్రయాణికులు విమానంలో నేరుగా ప్రవేశించవచ్చు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పనులన్ని శరవేగంగా కొనసాగుతున్నాయి, మరిన్ని డిజైన్ పనులు ఈ నెల మూడో వారంలో చేపట్టనున్నారు అధికారులు. గార్డెనింగ్, అంతర్గత రోడ్లు, కార్ పార్కింగ్ ప్రాంతం కూడా సిద్ధమయ్యాయి, వీటిని సోలార్ ఎనర్జీతో సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిచారు అధికారులు. ఇక మొత్తానికి ఈ నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ఈ గన్నవరం ఎయిర్‌పోర్టు దక్షిణ భారతదేశంలో ఉన్న మరో ప్రధాన విమానాశ్రయాలో ఒకటా అవతరించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.