Tirupathi Crime: రెండో అంతస్థు నుంచి దూకి ఒకరు.. ఐదో అంతస్థు నుంచి దూకి మరొకరు.. తిరుపతిలో కలకలం
తిరుపతి నగరంలో విషాదం నెలకొంది. ప్రేమ(Love) కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గా జరిగిన ఈ ఘటనలు స్థానికంగా సంచలనంగా మారాయి. నగరంలోని ఓ కాలేజ్ హాస్టల్ లో రెండో అంతస్థు నుంచి దూకి విద్యార్థిని...
తిరుపతి నగరంలో విషాదం నెలకొంది. ప్రేమ(Love) కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గా జరిగిన ఈ ఘటనలు స్థానికంగా సంచలనంగా మారాయి. నగరంలోని ఓ కాలేజ్ హాస్టల్ లో రెండో అంతస్థు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. విద్యార్థిని కేవీ.పల్లి మండలం గర్నిమిట్ట గ్రామానికి చెందిన విష్ణుప్రియగా గుర్తించారు. సరస్వతి, గోవిందు వీరి తల్లిదండ్రులు కాగా.. వారు కువైట్ లో కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వీరి విషయం పెద్దలకు తెలిసి, అభ్యంతరం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో అమరావతి నగర్ లోని బీసీ హాస్టల్ ఐదో అంతస్థు పై నుంచి దూకి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుంగనూరు మండలం భీమగానిపల్లి కి చెందిన నాగేంద్ర కుమార్.. ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఉంది. గత కొన్ని రోజులుగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆ అమ్మాయి నాగేంద్రను దూరం పెట్టింది. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read
Nithiin : మాచర్ల నియోజకవర్గంలో కుర్ర కలెక్టర్.. ఆకట్టుకుంటున్న నితిన్ లుక్
బీజేపీ-శివసేన మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. తాజాగా మోడీకి సవాల్ విసిరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే!