AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన ఐరాల మండలం నాగంవాండ్లపల్లెలో యశోద ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి.. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అని చెప్పి నమ్మించారు. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకురావాలని అడిగారు...

Andhra Pradesh: 'ఇంద్ర' సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..
Representative Image
Narender Vaitla
|

Updated on: Aug 24, 2024 | 9:09 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో చిరు మాస్‌ నటనకు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ అంతే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం తెనాలి నుంచి వచ్చిన ఓ కుటుంబాన్ని మోసం చేసే విధానం నవ్వు తెప్పిస్తుంది.

బంగారం డబుల్ అవుతుందంటూ పూజలు, చేసిన మొత్తం దోచేస్తారు బ్రహ్మానందం అండ్‌ గ్యాంగ్. అయితే అది సినిమా కాబట్టి నవ్వు తెప్పించింది. కానీ ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉటుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి మోసానికి పాల్పడ్డరు కొందరు మోసగాళ్లు. ఆరోగ్యం బాగు చేస్తామంటూ పూజలు చేయించి బంగారం మొత్తాన్ని దోచుకుపోయారు.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన ఐరాల మండలం నాగంవాండ్లపల్లెలో యశోద ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి.. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అని చెప్పి నమ్మించారు. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకురావాలని అడిగారు. దీంతో వారి మాటలను గుడ్డిగా నమ్మిన యశోద తన వద్ద ఉన్న 26 గ్రాముల బంగారాన్ని ఓ పెట్టెలో పెట్టి పూజలో కూర్చొంది.

కర్పూరం ఆరిపోయే వరకు కళ్లు తెరవకూడదని వారు చెప్పడంతో యశోద అలాగే చేసింది. కళ్లు తెరచి చూస్తే వారు పెట్టెలో బంగారం తీసుకొని రాళ్లు పెట్టి అదృశ్యమయ్యారు. దీంతో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. ప్రజలు మూఢనమ్మకాలను విడిచి పెట్టాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసు అధికారులు చెబుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్‌-100, 112, లేక పోలీసు వాట్సప్‌ నంబరు 94409 00005కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మణికంఠ కోరారు ప్రజలకు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..