Malaysia: ఫుట్‌పాత్ కుంగి.. సింక్‌హోల్‌లో పడిపోయిన కుప్పం మహిళ..
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విజయలక్ష్మి(45)అనే మహిళ గల్లంతైంది. మార్గంలో ప్రమాదవశాత్తూ పుట్ పాత్ కుంగడంతో విజయలక్ష్మి గల్లంతైంది. మహిళ కోసం మలేసియా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
మలేషియా కౌలాలంపూర్‌లో సింక్‌హోల్‌లో పడిపోయింది చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన మహిళ. 8 మీటర్ల లోతులో ఉన్న సింక్ హోల్‌లో పడిపోయింది. మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుప్పంకు చెందిన విజయలక్ష్మి కౌలాలంపూర్‌లో పూసల వ్యాపారం చేస్తోంది. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఆమె.. ఉన్నట్టుండి భూమి కుంగిపోవడంతో అందులో పడిపోయింది.
విజయలక్ష్మిది కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లి. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. హఠాత్తుగా ఫుట్‌పాత్ కుంగడంతో విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయింది. ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి గల్లంతుతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

