Tirumala: అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..

ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.. 15 రోజులే అయింది.. దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారికి దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కలినడకన బయలుదేరారు.. ఇంతలోనే..

Tirumala: అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..
Wedding
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 24, 2024 | 9:13 AM

ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.. 15 రోజులే అయింది.. దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారికి దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కలినడకన బయలుదేరారు.. ఇంతలోనే తీవ్ర విషాదం జరిగింది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో వెళుతుండగా గుండెపోటుతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

నవీన్‌ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.. 15 రోజుల క్రితం ఆయనకు వివాహమైంది. ఈ క్రమంలో నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చాడు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే.. 2,350వ మెట్టు దగ్గరకు రాగానే నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. వెంటనే.. అక్కడకు చేరుకున్న సిబ్బంది నవీన్‌ను అంబులెన్స్‌ ద్వారా తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే.. నవీన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

కాగా.. నవీన్‌ది తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతం కాగా.. ఆయన బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ ఘటనపై తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఇలా జరగడంతో వరుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..