Andhra Pradesh: దొంగలను పట్టించిన ‘OY’ అనే అక్షరాలు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు..
సాగర తీరంలో స్నాచర్ల లొల్లి.. ఇద్దరే ఇద్దరూ .. నాలుగు రోజుల వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు తెగపడ్డారు. సీసీ కెమెరాలో బొమ్మ పడటంతో ఆ ఇద్దరు ఎవరన్నదీ.. సవాలుగా మారింది.. దొంగతనానికి వారిద్దరూ కొత్త.. అయితే, వారు ఎలా చిక్కారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.. రెండక్షరాలు వారిని పట్టించాయి.. ఆ స్టోరీ ఏంటో లుక్కెయండి..
ఒకడు డెలివరీ బాయ్.. మరొకడు స్కూలు బస్సు డ్రైవర్..! ఇంకేముంది రోడ్లన్నీ బాగా తెలుసు. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఇక గెటప్ మార్చేశారు..! వాళ్ల ప్లాన్, గెటప్ అబ్బో మామూలుగా లేదు. ముఖానికి మాస్క్.. బైక్ నెంబర్ కనిపించకుండా దానికీ మాస్క్..! పట్టుకోవడం పోలీసులకు పని కాస్త కష్టమైనా.. ఆ ఒక్క క్లూ తో చిక్కిపోయారు. ఇంతకీ వాళ్లు చేస్తున్నది ఏమిటి..? ముఖానికి మాస్క్.. తలపై టోపీ.. కళ్ళకు అద్దాలు..! ఇక బైక్ కు కూడా నెంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్తలు. ఎందుకో తెలుసా..? దొంగతనాలు చేయడానికి. అది కూడా గొలుసు దొంగలుగా మారారు వీళ్లిద్దరు. తమకు ఫుల్లుగా పట్టున్న రోడ్లను వీధులను ఎంచుకొని నేరాలు చేయడం ప్రారంభించారు. అయితే సీసీటీవీ ఫోటేజ్‌లో దొరికి చిన్న క్లూ వారిని పట్టించింది.
టోపీ తో బైక్ వెనకాల కూర్చున్న వాడే… ఈ బ్లాక్ టీ షర్ట్ లో ఉన్న వాడు. పేరు మణికంఠ. చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం. కానీ ఇప్పుడు దొంగగా మారిపోయాడు. ఇక ఈ డ్రైవింగ్ చేస్తున్నాడే.. వీడు జగదీశ్వరరావు. చేసేది స్కూల్ బస్సు డ్రైవర్. మణికంఠతో జత కలిసి చైన్స్ నేచర్ గా మారిపోయాడు. ఇద్దరికీ ఒక అలవాటు అంటే లేదు. జల్సా లకు అలవాటు పడ్డారు. ఇక ఈజీ మనీ కోసం దొంగల మరి పని ప్రారంభించేశారు.
మరి ఎవరు గుర్తుపట్టకూడదు కదా..
చైన్ స్నాచింగ్లు చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత.. సొత్తు చేతికి చిక్కాలి కానీ ఎవరు గుర్తుపట్టకూడదు. ఈ విధంగా ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. షాప్ కు వెళ్లారు.. మోకాలకు మాస్కులు కళ్ళద్దాలు… తలకు టోపీ కొనుగోలు చేశారు. అవి కూడా వాళ్లకు ఇష్టమైనవే. ఇద్దరూ సిద్ధమైన తర్వాత.. స్నాచింగ్కు వెళ్లే ముందు బండి నెంబరు ప్లేట్ కు ముసుగు వేసేసారు. బస్సు డ్రైవర్ బైక్ డ్రైవర్ గా మారితే… డెలివరీ బాయ్ వెనుక కూర్చొని గొలుసు తెంచే పనిలో పడ్డాడు. ఇలా.. ఏప్రిల్ 19న దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఓ రైల్వే ఉద్యోగిని వెళ్తుండగా రూట్ కోసం అని అడిగి చైన్ లాక్కొని పారిపోయారు. ఆది చేసిన నాలుగో రోజు మరో మహిళను టార్గెట్ చేసి చైన్ ఎత్తుకెళ్లిపోయారు.
దొంగలను పట్టించిన ‘OY’
– ఫిర్యాదు అందుకున్న తర్వాత పని ప్రారంభించిన పోలీసులు.. తీవ్రంగానే శ్రమించారు. ఎందుకంటే.. ముఖాలకు మాస్కులు క్యాబ్ ఉండడం, చాలా సీసీ కెమెరాలు బండి నెంబర్ కనిపించకపోవడం… కనిపించిన చోట అస్పష్టంగా ఉండడం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1800 సీసీ కెమెరాలు వెరిఫై చేశారు. తొలుత ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో.. పాత నిరస్తులను వెరిఫై చేశారు . ఎక్కడ వీళ్ళతో మ్యాచ్ కాలేదు. పోనీ జైల్లో ఉన్న నేరస్థుల నుంచి ఎటువంటి నేరాలు చేసే వారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా ఫలితం లేదు. ఇక చివరి ప్రయత్నం గా.. వాళ్లు ధరించిన గెటప్ పైనే వర్క్ అవుట్ చేసారు పోలీసులు.
దీంతో తలపై పెట్టుకున్న క్యాప్ కు ‘OY’ అక్షరం కనిపించింది. దీంతో.. ‘BOY’ గా ఆ పదాన్ని నిర్ధారించుకొని అటువంటి క్యాప్ లను అమ్ముతున్న షాపులను వెరిఫై చేశారు. పోలీసుల అదృష్టమో.. దొంగల దురదృష్టమో కానీ అదే తరహాలో మరో క్యాప్ ను కొనుగోలు చేసేందుకు వచ్చారు. దీంతో పోలీసులకు చిక్కిపోయారు. తొలుత తాము కాదని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. సీసీ కెమెరాల్లో తీసిన చిత్రాలు పోలి ఉన్నట్టు గుర్తించి తమదైన స్టైల్ లో విచారించేసరికి అసలు విషయాన్నీ ఒప్పుకోక తప్పలేదన్నారు క్రైమ్ డిసిపి నాగన్న. దీంతో ఇద్దరు నుంచి బంగారు గొలుసులను రికవరీ చేసి అరెస్టు చేసి కటకటాల వెనక్కు నిట్టమన్నారు.
చదివారు కదా… హ్యాపీగా వచ్చిన ఆదాయంతో బతకడం అని ఇలా అడ్డదారులు తొక్కితే.. అంతే మరి. ఎంతటి కొమ్ములు తిరిగిన నేరస్తుడైన ఖాకీల చేతికి చిక్కక తప్పదు. పాపం.. చేసిన తొలి ప్రయత్నంలో వాళ్ల ఆనంద క్షణాలు కొద్ది సమయంలోనే ఆవిరై చివరకు కటకటాల పాలయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం