TTD: తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సు.. పాల్గొననున్న ప్రముఖ పీఠాధిపతులు..

సనాతన ధార్మిక సదస్సు ను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది. టీటీడీ జేఈవో భార్గవి ధార్మిక సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నిర్వహించిన సమీక్షలో జేఈవో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

TTD: తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సు.. పాల్గొననున్న ప్రముఖ పీఠాధిపతులు..
Ttd Jeo
Follow us
Raju M P R

| Edited By: Srikar T

Updated on: Jan 22, 2024 | 8:06 PM

తిరుపతి, జనవరి 22: సనాతన ధార్మిక సదస్సు ను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది. టీటీడీ జేఈవో భార్గవి ధార్మిక సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నిర్వహించిన సమీక్షలో జేఈవో అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక‌లు, ధార్మిక కార్యక్రమాల‌పై బుక్ లెట్ రూపొందించాలని డిపిపి అధికారులను ఆదేశించారు.

సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా స‌దుపాయాల‌ను స‌మ‌న్వయం చేసుకోవ‌డానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిర్వహించే ధ‌ర్మ ప్రచార కార్యక్రమాల‌పై వీడియో రూపొందించాల‌ని ఎస్వీబీసి సీఈవోను ఆదేశించారు. స‌నాత‌న ధార్మిక సదస్సును ఘ‌నంగా నిర్వహించేందుకు లైజ‌న్, నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు. ధార్మిక సదస్సు నిర్వహణకు సంబంధించి చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్లను విభాగాల వారిగా జేఈవో స‌మీక్షించారు. ఈ సమావేశంలో వేద విశ్వవిద్యాల‌యం విసి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఎస్వీబీసి సీఈవో ష‌ణ్ముఖ కుమార్‌, డిపిపి కార్యదర్శి సోమయాజులు, ప్రోగ్రాం అధికారి రాజగోపాల్ తోపాటు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు, క‌ల్యాణం ప్రాజెక్టు అధికారి చంద్రశేఖ‌ర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌‎లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..