కనువిందు చేస్తున్న బాలరాముడి సైకత శిల్పం..3డి లుక్కులో అయోధ్య రామ మందిర శిల్పాలు.. చూసి తీరాల్సిందే..

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. భారతదేశమంతా రాముడి తన్మయత్వంలో మునిగిపోయింది. దేశ, విదేశాల్లో అయోధ్యలో రాముడి ఆలయాన్ని తమకు తోచిన ఆకృతుల్లో ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు రామ భక్తులు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు తయారు చేసిన బాలరాముడి సైత శిల్పం, అయోధ్య రామ మందిర శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

కనువిందు చేస్తున్న బాలరాముడి సైకత శిల్పం..3డి లుక్కులో అయోధ్య రామ మందిర శిల్పాలు.. చూసి తీరాల్సిందే..
Lord Sri Ram Sand Art
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 22, 2024 | 4:09 PM

గుంటూరు, జనవరి22; గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఇలాంటి ఆకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాడేపల్లిలో జాతీయ రహదారి పక్కనే సైకత శిల్పాన్ని శిల్పి బాలాజీ వర ప్రసాద్ ఏర్పాటు చేశారు. దాదాపు ఎనిమిది గంటలు పాటు శ్రమించి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగే సమయానికి సైకత శిల్పాన్ని పూర్తి చేశారు. మందిర నమూనాతో పాటు బాల రాముడి సైకత శిల్పాన్ని చెక్కారు. చూడ ముచ్చటగా ఉన్న సైకత శిల్పాన్ని సందర్శించిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అయోధ్య సరయూ తీరంలోనే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయాలనుకున్నానని అయితే అనుమతి రాకపోవడంతో నే తాడేపల్లిలో శిల్పాన్ని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్లు బాలాజీ తెలిపారు.

ప్రపంచంలోని భాయతీయులందరికీ సంతోషకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. ఎప్పటికైనా సరయూ తీరంలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేస్తానని బాలాజీ తెలిపారు. రెండు మూడు రోజుల పాటు ఈ సైకత శిల్పం భక్తులను అలరించనుంది.

ఇది ఇలా ఉంటే తెనాలి సూర్య శిల్ప శాల శిల్పులు 3డి రామ మందిరాన్ని రూపొందించి తెనాలిలో ప్రదర్శనకు ఉంచారు. అనేక మంది భక్తులు ఈ ఆలయం నమూనాని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు‌. 3డి శిల్పాలను ఏర్పాటు చేయడంలో శిల్పి వెంకటేశ్వరావుతో పాటు ఆయన కుమారులు రవిచంద్ర, హర్షలకు ఎంతో ప్రావీణ్యం ఉంది.

ఇవి కూడా చదవండి

దేశం మొత్తం కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాము కూడా ఉడతా భక్తిగా ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే 3డి రామమందిర నమూనాని ఏర్పాటు చేశామని శిల్పి వెంకటేశ్వరావు చెప్పారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగే సమావేశానికి 3డి నమూనా ప్రదర్శనకు ఉంచడంతో అనేక మంది భక్తులు నమూనాని తిలకించారు. మందిర నమూనాను చక్కగా ఏర్పాటు చేసిన శిల్పులను తెనాలి వాసులు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..