AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అమ్మో..! చిల్లర నాణేలతో ఏకంగా రూ. 1.30 లక్షల బైక్ కొన్నాడు.. వీడియో చూస్తే.!

చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. తాను ఇప్పటివరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు.. తన కల సాకారం చేసుకున్నాడు.

AP News: అమ్మో..! చిల్లర నాణేలతో ఏకంగా రూ. 1.30 లక్షల బైక్ కొన్నాడు.. వీడియో చూస్తే.!
Bike Brought With Coins
Raju M P R
| Edited By: |

Updated on: Jan 22, 2024 | 12:01 PM

Share

చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. తాను ఇప్పటివరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు.. తన కల సాకారం చేసుకున్నాడు. పలమనేరులోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంకు చిల్లర నాణేల సంచులతో చేరుకున్న బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు అక్కడి సిబ్బంది ముక్కుపై వేలు వేసుకునేలా చేశాడు. బైక్ కొనుగోలు కోసం వచ్చిన అర్చక దంపతులు మురళీధరాచార్యులు, ఉష షోరూమ్ అంతటా తిరిగి.. అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్ చూశారు. అర్చకుడు తన వెంట డబ్బుగా.. చిల్లర నాణేలను తీసుకొచ్చిన సంగతి తెలియని షోరూమ్ సిబ్బంది.. అతడికి తమ వద్ద ఉన్న అన్ని వాహనాలను చూపించారు. అన్ని మోడల్స్ చూసిన అనంతరం.. ఎట్టకేలకు టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తానని.. తన పేరు మీద బిల్లింగ్ చేయాలని కోరాడు.

దీంతో అర్చకుడి పేరుపై బిల్లు ప్రిపేర్ చేసిన షోరూమ్ సిబ్బంది.. జుపిటర్‌కు రూ. 1.30 లక్షలు చెల్లించాలని తెలిపారు. ఇక వారికి షాకిస్తూ తన దగ్గర ఉన్న చిల్లర నాణేల సంచులను రాశులుగా పోశాడు పురోహితుడు. దీంతో షోరూమ్ సిబ్బందికి దిమ్మతిరిగిపోయింది. అంత మొత్తంలో చిల్లర నాణేలను చూసి అవాక్కైన షోరూం యజమాని ఒకింత షాక్‌కు గురైనా.. చేసేదేమిలేక చిల్లర లెక్కింపునకు సిద్దమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చిల్లర లెక్కించారు. మొదట షోరూమ్ సిబ్బంది చిల్లర నాణేలను లెక్కించేందుకు చిరాకుపడ్డా.. ఈ వింతైన అనుభవంతో చివరికి చిరునవ్వుతో బైక్‌ను అర్చక దంపతులకు అప్పగించారు షోరూమ్ నిర్వాహకులు.

బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లె కాలభైరవ స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మురళీధరాచార్యులు.. మూడేళ్లుగా భక్తుల కానుకలను కూడబెట్టి ఈ బైక్ కొన్నాడు. అర్చకుడి బైక్ కొనాలన్న కోరిక నెరవేరగా.. షోరూమ్ యజమాని అతడి చేత కేక్ కట్ చేయించి.. స్కూటర్‌ను అప్పగించారు.

వీడియో 1:

వీడియో 2:

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి