YS Jagan: వై నాట్ 175.. ఇక ప్రచారంపై జగన్ ఫోకస్.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2 లక్షల మందితో తొలి సభ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 34 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభకు వస్తారని ఆయన అన్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిపారు.
వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. దీంతో సీఎం జగన్ కూడా త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..