Viral: మా ఊళ్లో మగాళ్లకు పెళ్లి కావడం లేదు.! మంత్రికి గ్రామస్థుల కంప్లైంట్..
ఆ ఊళ్లో మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదట. యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ఏకంగా గ్రామస్తులంతా కలిసి రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ ఊళ్ళో యువకులకు పెళ్లిళ్లు ఎందుకు అవ్వడం లేదు?. ఆడపిల్లను ఇచ్చేవాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదో తెలిస్తే నిజంగానే అశ్చర్యపోవాల్సిందే! సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేక, యువకులకు పెళ్లిళ్లు అవ్వడం లేదని..
ఆ ఊళ్లో మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదట. యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ఏకంగా గ్రామస్తులంతా కలిసి రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ ఊళ్ళో యువకులకు పెళ్లిళ్లు ఎందుకు అవ్వడం లేదు?. ఆడపిల్లను ఇచ్చేవాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదో తెలిస్తే నిజంగానే అశ్చర్యపోవాల్సిందే! సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేక, యువకులకు పెళ్లిళ్లు అవ్వడం లేదని ఓ మహిళ మంత్రి ఉషశ్రీకి ఫిర్యాదు చేశారు. దయచేసి తమ గ్రామానికి తారు రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని వేడుకున్నారు. ఆ మహిళతో పాటు గ్రామస్తులంతా కలసి మంత్రికి గోడు వెళ్ళబోసుకున్నారు.
కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని మంత్రి ఉషశ్రీ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన సమస్యలు ఎలా ఉన్నా, మొదట తమ గ్రామానికి తారు రోడ్డు వేయాలని యువకులు కోరారు. రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చే వరకు మహిళలు, యువకులు మంత్రి ఉషశ్రీని పట్టబట్టారు. గ్రామానికి తారు రోడ్డు లేకపోవడం వల్లే యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడంలేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి ఉషశ్రీ వెంటనే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తారు రోడ్డు లేక పెళ్ళి కావడం లేదనడంతో మంత్రి ఉషశ్రీ తోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

